Everest | ఎవ‌రెస్టును ఇక అత్యంత ఎత్తైన డంపింగ్ యార్డు అనాల్సిందేనా?

విధాత‌: ఎవ‌రెస్టు (Everest)ను వారు అధిరోహించారు.. వీరు అధిరోహించార‌ని జ‌బ్బ‌లు చ‌రుచుకోవ‌డ‌మే త‌ప్ప అలాంటి వారి వ‌ల్ల అక్క‌డి సున్నిత ప‌ర్యావ‌ర‌ణానికి జ‌రుగుతున్న న‌ష్టం గురించి ఎవ‌రూ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా అక్క‌డి ప‌రిస్థ‌తిని సుప్రియా సాహు అనే ఐఏఎస్ అధికారిణి పోస్టు చేయ‌డంతో.. దీనిపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఒక చిన్న సైజు ప‌ట్ట‌ణానికి ఉండే డంపింగ్ యార్డ్ సైజులో ఎవ‌రెస్టు శిఖ‌రంపై చెత్త పేరుకుపోయి ఉండ‌టం వీడియోలో క‌నిపిస్తోంది. ప‌రిస్థితి ఇలానే కొన‌సాగితే ఎవ‌రెస్టును […]

Everest | ఎవ‌రెస్టును ఇక అత్యంత ఎత్తైన డంపింగ్ యార్డు అనాల్సిందేనా?

విధాత‌: ఎవ‌రెస్టు (Everest)ను వారు అధిరోహించారు.. వీరు అధిరోహించార‌ని జ‌బ్బ‌లు చ‌రుచుకోవ‌డ‌మే త‌ప్ప అలాంటి వారి వ‌ల్ల అక్క‌డి సున్నిత ప‌ర్యావ‌ర‌ణానికి జ‌రుగుతున్న న‌ష్టం గురించి ఎవ‌రూ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా అక్క‌డి ప‌రిస్థ‌తిని సుప్రియా సాహు అనే ఐఏఎస్ అధికారిణి పోస్టు చేయ‌డంతో.. దీనిపై చ‌ర్చ జ‌రుగుతోంది.

ఒక చిన్న సైజు ప‌ట్ట‌ణానికి ఉండే డంపింగ్ యార్డ్ సైజులో ఎవ‌రెస్టు శిఖ‌రంపై చెత్త పేరుకుపోయి ఉండ‌టం వీడియోలో క‌నిపిస్తోంది. ప‌రిస్థితి ఇలానే కొన‌సాగితే ఎవ‌రెస్టును ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన డంపింగ్ యార్డుగా ప్ర‌క‌టించాల్సి వ‌స్తుంద‌ని నెటిజ‌న్లు, ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు విమ‌ర్శిస్తున్నారు.

మ‌నిషి ఎవ‌రెస్టును కూడా చెత్త పడేసే ప్ర‌దేశంగా ఉప‌యోగించ‌డం చూసి గెండె బ‌ద్ద‌ల‌యింద‌ని సుప్రియా సాహు త‌న పోస్టుకు ట్యాగ్ లైన్ జ‌త చేశారు. ఎవ‌రెస్టుపై రూ. కోట్ల‌లో వ్యాపారం జ‌రుగుతుండ‌టం, దీన్ని ఎక్క‌డాన్ని ఒక గౌరవంగా భావిస్తుండ‌టంతో ఆ శిఖ‌రాన్ని ఎక్కేవారి సంఖ్య ఇటీవ‌లి కాలంలో బాగా పెరిగింది. ఎవ‌రెస్టు టుడే అనే యూజ‌ర్ ఈ వీడియోను తొలుత నెట్‌లో పెట్ట‌గా… ప్ర‌స్తుతం అక్క‌డి ప‌రిస్థ‌తిపై భారీ ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.