Russia | గ్యాస్ స్టేష‌న్‌లో ఘోర అగ్నిప్ర‌మాదం.. ముగ్గురు చిన్నారులు స‌హా 27 మంది దుర్మ‌ర‌ణం

Russia | విధాత‌: ర‌ష్యా (Russia) లో సోమ‌వారం అర్ధ‌రాత్రి ఘోర అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఇక్క‌డి ద‌గేస్తాన్ ప్రాంతంలోని మ‌ఖాచ‌క్లాలో ఉన్న ఒక గ్యాస్ స్టేష‌న్‌లో మంట‌లు చెల‌రేగ‌డంతో ముగ్గురు చిన్నారులతో పాటు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 66 మ‌ది తీవ్ర గాయాల‌పాల‌య్యారు. హైవే పై ఉన్న ఒక గ్యారేజీలో తొలుత నిప్పు అంటుకున్న‌ట్లు అధికారులు అంచ‌నా వేస్తున్నారు. అక్క‌డ ఉండే ఆయిల్ కార‌ణంగా మంట‌లు వేగంగా వ్యాపించి దానికి కాస్త […]

Russia | గ్యాస్ స్టేష‌న్‌లో ఘోర అగ్నిప్ర‌మాదం.. ముగ్గురు చిన్నారులు స‌హా 27 మంది దుర్మ‌ర‌ణం

Russia | విధాత‌: ర‌ష్యా (Russia) లో సోమ‌వారం అర్ధ‌రాత్రి ఘోర అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఇక్క‌డి ద‌గేస్తాన్ ప్రాంతంలోని మ‌ఖాచ‌క్లాలో ఉన్న ఒక గ్యాస్ స్టేష‌న్‌లో మంట‌లు చెల‌రేగ‌డంతో ముగ్గురు చిన్నారులతో పాటు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 66 మ‌ది తీవ్ర గాయాల‌పాల‌య్యారు. హైవే పై ఉన్న ఒక గ్యారేజీలో తొలుత నిప్పు అంటుకున్న‌ట్లు అధికారులు అంచ‌నా వేస్తున్నారు. అక్క‌డ ఉండే ఆయిల్ కార‌ణంగా మంట‌లు వేగంగా వ్యాపించి దానికి కాస్త దూరంలో ఉన్న గ్యాస్ స్టేష‌న్‌ (Gas station Burst) ను చుట్టేశాయి. ఈ ప్ర‌భావంతో అక్క‌డ భారీ విస్ఫోటం సంభ‌వించి ఘోర అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది.

ప్ర‌మాద ఘ‌ట‌న ఒక యుద్ధ స‌న్నివేశాన్ని త‌ల‌పించింద‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు వ‌ర్ణించారు. ఒక అంత‌స్తు మొత్తం క్ష‌ణాల్లో బూడిద‌య్యింద‌ని తెలిపారు. వ‌రుస పేలుళ్లు, ఉవ్వెత్తున్న ఎగిసి ప‌డుతున్న మంట‌లు, న‌ల్ల‌టి పొగ‌తో ప్ర‌ళ‌య‌కాలంలా క‌నిపించింద‌ని మ‌రొక ప్ర‌త్య‌క్ష‌సాక్షి పేర్కొన్నారు. పేలుడు శ‌బ్దం వ‌చ్చిన మ‌రుక్ష‌ణం.. మా నెత్తి మీద బ‌రువైన శిథిలాలు ప‌డిపోయాయ‌ని, ఆ త‌ర్వాత ఏమీ గుర్తు లేద‌ని ప్ర‌మాద స‌మ‌యంలో గ్యాస్‌స్టేష‌న్‌లో ఉన్న ఓ క్ష‌త‌గాత్రుడు గుర్తుచేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్‌లో చక్క‌ర్లు కొడుతోంది.

ఈ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన వారిలో 10 మంది చావు బ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్న‌ట్లు అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మ‌రింత అవ‌కాశ‌ముంద‌ని అంచ‌నా వేస్తున్నారు. గాయ‌ప‌డిన వారిలో 16 మంది చిన్నారుల‌నేన‌ని స‌హాయ‌క బృందం స‌భ్యుడు ఒక‌రు పేర్కొన్నారు. మొత్తం 715 చ‌.కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ గ్యాస్ స్టేష‌న్‌లో మంట‌లార్ప‌డానికి అగ్నిమాప‌క సిబ్బంది చెమటోడ్చారు. సుమారు 3.5 గంట‌లు తీవ్రంగా శ్ర‌మించి వాటిని అదుపులోకి తీసుకొచ్చారు.