America | పోలీసులను గడగడలాడించిన 98 ఏళ్ల బామ్మ.. కానీ తర్వాతి రోజే…
America | విధాత: తన ఇంట్లో సోదాకు వచ్చిన పోలీసు అధికారులను 98 ఏళ్ల బామ్మ ఇంటి నుంచి బయటకు పొండి అని ధైర్యంగా గద్దించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అమెరికాలోని కాన్సాస్ పత్రిక ఎడిటర్ తల్లి జాన్ మేయెర్ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారులు రావడం.. ఆమె వారితో వాదించడం తదితర ఘటనలన్నీ ఇంట్లో ఉన్న కెమెరాలో రికార్డయ్యాయి. పొడవైన గౌన్ వేసుకుని బామ్మ కూర్చుని ఉండగా.. […]

America |
విధాత: తన ఇంట్లో సోదాకు వచ్చిన పోలీసు అధికారులను 98 ఏళ్ల బామ్మ ఇంటి నుంచి బయటకు పొండి అని ధైర్యంగా గద్దించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అమెరికాలోని కాన్సాస్ పత్రిక ఎడిటర్ తల్లి జాన్ మేయెర్ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారులు రావడం.. ఆమె వారితో వాదించడం తదితర ఘటనలన్నీ ఇంట్లో ఉన్న కెమెరాలో రికార్డయ్యాయి.
పొడవైన గౌన్ వేసుకుని బామ్మ కూర్చుని ఉండగా.. ఆమె ఇంట్లోకి ఆరుగురు పోలీసులు వచ్చారు. వచ్చీ రావడంతోనే ఎటువంటి అనుమతి లేకుండా వస్తువులన్నీ సోదా చేయడం ప్రారంభించారు. ఆ అలికిడి విన్న బామ్మ.. స్టాండ్ సాయంతో నడుచుకుంటూ వారి వద్దకు వెళ్లారు.
ఇది నా ఇల్లు.. ఎక్కడివక్కడ పెట్టేసి బయటకి పొండి అంటూ విరుచుకుపడింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవడంతో అందరూ పోలీసుల తీరును తప్పుబడుతూ కామెంట్లు చేస్తున్నారు. వృద్ధులు ఇంట్లో ఉన్నపుడు వారికి చెప్పి సోదాలు నిర్వహించాల్సింది అంటూ సూచిస్తున్నారు.
కాగా.. తన వ్యక్తిగత వివరాలను అక్రమంగా సేకరించాన్న ఓ రెస్టారెంట్ నిర్వాహకురాల ఫిర్యాదుపై ఎడిటర్ ఇంట్లో సోదాలు చేసినట్లు పోలీసులు వివరణ ఇచ్చారు. ఆగస్టు 11న ఈ ఘటన జరగగా.. ఆ తర్వాతి రోజే బామ్మ చనిపోయినట్లు ఆమె కుమారుడు తెలిపారు.
ఈ ఘటన వల్ల ఆమె అనుభవించిన ఒత్తిడి కూడా మరణానికి కారణమని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో తనకు ఎంతగానో నచ్చిందని.. బామ్మ ధైర్యానికి హ్యాట్సాఫ్ అని యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.