చెల్లిని గర్భవతి చేసిన అన్న.. ఇప్పుడామెకు ఏడు నెలలు
విధాత: వారిద్దరూ వరుసకు అన్నాచెల్లెల్లు. ఇద్దరూ కలిసి చదువుకుంటున్నారు. ఒకే స్కూల్ కావడంతో.. ఒకేసారి వెళ్లి రావడం జరిగింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. శారీరకంగా దగ్గరయ్యారు. బాలిక గర్భం దాల్చడంతో భయపడి పోయి బీహార్ నుంచి హైదరాబాద్‌కు పారి పోయి వచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన ఓ బాలుడు, బాలిక పక్క పక్క నివాసాల్లోనే ఉంటారు. వీరి వయసు 15 ఏండ్లు.. కాగా వరుసకు అన్నాచెల్లెల్లు అవుతారు. అయితే ఇద్దరూ ఒకే […]

విధాత: వారిద్దరూ వరుసకు అన్నాచెల్లెల్లు. ఇద్దరూ కలిసి చదువుకుంటున్నారు. ఒకే స్కూల్ కావడంతో.. ఒకేసారి వెళ్లి రావడం జరిగింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. శారీరకంగా దగ్గరయ్యారు. బాలిక గర్భం దాల్చడంతో భయపడి పోయి బీహార్ నుంచి హైదరాబాద్‌కు పారి పోయి వచ్చారు.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన ఓ బాలుడు, బాలిక పక్క పక్క నివాసాల్లోనే ఉంటారు. వీరి వయసు 15 ఏండ్లు.. కాగా వరుసకు అన్నాచెల్లెల్లు అవుతారు. అయితే ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుతున్నారు. దీంతో అన్నాచెల్లెల్లు ఇద్దరూ ఒకేసారి స్కూల్‌కు వెళ్లి రావడం జరుగుతోంది.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, శారీరకంగా దగ్గరయ్యారు. బాలికకు రెండు నెలల క్రితం రుతుక్రమం ఆగిపోయింది. ఈ విషయాన్ని అబ్బాయికి తెలియజేయగా, డాక్టర్‌ను సంప్రదించగా, ఏడు నెలల గర్భిణి అని తేలింది. దీంతో భయ పడిపోయిన వారిద్దరూ బీహార్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రైల్లో చేరుకున్నారు.
సికింద్రాబాద్ స్టేషన్‌లో వారిని దివ్యదశ చైల్డ్ లైన్ ప్రతినిధులు గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని ఆరా తీయగా జరిగిన విషయం చెప్పారు. ఇరు కుటుంబాలకు దివ్యదశ చైల్డ్ లైన్ ప్రతినిధులు సమాచారం అందించారు. మొదట బాలుడిని, ఆ తర్వాత బాలికను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే బాలిక పేరెంట్స్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ కేసును బీహార్‌కు బదిలీ చేశారు.