మాకు వేరే రాష్ట్రం ఇచ్చేయండి.. ధర్మాన కొత్త కాన్సెప్ట్!!

విధాత‌: ఇప్పటికే మూడు రాజధానుల గొడవ ఇలా నిప్పులు పుట్టిస్తుంటే మధ్యలో ఇంకో పెద్దాయన దూరిపోయి ఇంకో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. రెవెన్యూ మంత్రి ధర్మాన ఈ కొత్త తరహా కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఉబుసుపోక అన్నారో, జనాన్ని ఇలా డైవర్ట్ చేయడానికి అన్నారో గానీ మొత్తానికి జనాలను ఆలోచింపజేశారు. ఇప్పటికే మూడు రాజ‌ధానుల‌కు సానుకూలంగా ఎన్నోసార్లు మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు ఏకంగా ప్రత్యేక రాష్ట్రం కావాలని దానికి విశాఖ రాజధాని కావాలని అంటున్నారు. మాకు విశాఖను […]

  • Publish Date - January 1, 2023 / 10:44 AM IST

విధాత‌: ఇప్పటికే మూడు రాజధానుల గొడవ ఇలా నిప్పులు పుట్టిస్తుంటే మధ్యలో ఇంకో పెద్దాయన దూరిపోయి ఇంకో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. రెవెన్యూ మంత్రి ధర్మాన ఈ కొత్త తరహా కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఉబుసుపోక అన్నారో, జనాన్ని ఇలా డైవర్ట్ చేయడానికి అన్నారో గానీ మొత్తానికి జనాలను ఆలోచింపజేశారు.

ఇప్పటికే మూడు రాజ‌ధానుల‌కు సానుకూలంగా ఎన్నోసార్లు మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు ఏకంగా ప్రత్యేక రాష్ట్రం కావాలని దానికి విశాఖ రాజధాని కావాలని అంటున్నారు. మాకు విశాఖను రాజధానిగా వదిలేస్తే ఉత్తరాంధ్రాతో చిన్న రాష్ట్రం గా చేసుకుంటామని ధర్మాన అన్నారు.

మన కళ్లతో మనలను చంద్రబాబు పొడుస్తున్నారు అని.. ఉత్తరాంధ్రా వచ్చి విశాఖ రాజధానిని కాదంటారా అని కూడా ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో ఆయన మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

ఏదేమైనా.. ఇప్పటి వరకు ఉన్న రాజధాని సెంటిమెంటును ఆయన మరింత ఎగదోశారనేది వాస్తవం. వచ్చే ఎన్నికలలోపు విశాఖను పాలనా రాజధాని చేయడం ఖాయమని నిన్న మొన్నటి వరకు చెప్పుకొచ్చిన ధర్మాన.. అనూహ్యంగా ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని తెరమీదికి తీసుకువచ్చి.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

మూడు జిల్లాలు ఉన్న ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయడం సాధ్యమా కాదా.. అనేది వదిలేస్తే.. ధర్మాన మాత్రం తేనెతుట్టెను కదిపేశారని అంటున్నారు.