Janasena | జనసేనకు గుడ్ న్యూస్.. గాజు గ్లాస్ దక్కింది!
Janasena | విధాత: ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధం అవుతున్న తరుణంలో మిగతా పార్టీల కన్నా జనసేనకు ఇప్పుడు కాస్త ఉత్సాహాన్నిచ్చే సమాచారం వచ్చింది. జనసేన (Janasena)కు పార్టీ గుర్తుగా గాజు గ్లాస్ను కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. వాస్తవానికి ఆ పార్టీకి కామన్ సింబల్ రాదని ఆందోళన చెందారు. కామన్ సింబల్ కాకుండా ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో గుర్తు వస్తె ఎలా ? ప్రచారం ఎలా అని. క్యాడర్ అయోమయానికి గురైంది.. ఒక్కో చోట […]

Janasena |
విధాత: ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధం అవుతున్న తరుణంలో మిగతా పార్టీల కన్నా జనసేనకు ఇప్పుడు కాస్త ఉత్సాహాన్నిచ్చే సమాచారం వచ్చింది. జనసేన (Janasena)కు పార్టీ గుర్తుగా గాజు గ్లాస్ను కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. వాస్తవానికి ఆ పార్టీకి కామన్ సింబల్ రాదని ఆందోళన చెందారు.
కామన్ సింబల్ కాకుండా ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో గుర్తు వస్తె ఎలా ? ప్రచారం ఎలా అని. క్యాడర్ అయోమయానికి గురైంది.. ఒక్కో చోట ఒక్కో గుర్తు వస్తే ప్రచారం ఎలా చేస్తాం..ఇదెక్కడి తలనొప్పి అని క్యాడర్ ఆందోళన చెందుతోంది. అయితే ఇప్పుడు టెన్షన్ లేకుండానే రాష్ట్రం మొత్తం ఒకే గుర్తు ఇస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.
19 రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. వైసిపి, టిడిపి మాత్రమే రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలు గా ఈసీ పేర్కొనగా ఐదు జాతీయ పార్టీలు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్న 11 పార్టీలకు గుర్తులను కేటాయిస్తు ఉత్తర్వులు ఇచ్చింది. జనసేనకు రిజర్వుడ్ సింబల్ కలిగిన రిజిస్టర్డ్ పార్టీల జాబితాలోనే ఉంచుతు గాజు గ్లాసు గుర్తును కొనసాగిస్తోంది.
వాస్తవానికి ఇటీవల రాష్ట్రంలో గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీ హోదా నుంచి ఇటీవల జనసేనను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. దీంతో గ్లాసు సింబల్ ఫ్రీ సింబల్ అయింది. అంటే ఆ గుర్తు ఎవరికీ అయినా కేటాయించ వచ్చన్నమాట. దీంతో జనసేవలో ఆందోళన మొదలైంది. అయితే మళ్ళీ గాజు గ్లాసును జనేనకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేయడం హర్షణీయం
జనసేన పార్టీ ఎన్నికల గుర్తు “గాజు గ్లాసు”
రానున్న ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేద్దాం – జనసేన ప్రభుత్వాన్ని తీసుకువద్దాం.#VoteForGlass #HelloAP_ByeByeYCP pic.twitter.com/7x5aPrN2Xj
— JanaSena Party (@JanaSenaParty) June 24, 2023