పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం
Godavari Express : విశాఖపట్నం - హైదరాదాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. యాదాది భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద గోదావరి ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం పట్టాలు తప్పింది. రైలుకు చెందిన ఐదు బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. పలు బోగీల్లోని ప్రయాణికులు కిందపడిపోగా స్వల్ప గాయాలయ్యాయి. బోగీలు పడిపోయి ఉంటే పెను నష్టమే జరిగి ఉండేదంటూ జనం ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరికీ ఎలాంటి హాని జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న […]

Godavari Express : విశాఖపట్నం – హైదరాదాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. యాదాది భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద గోదావరి ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం పట్టాలు తప్పింది. రైలుకు చెందిన ఐదు బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. పలు బోగీల్లోని ప్రయాణికులు కిందపడిపోగా స్వల్ప గాయాలయ్యాయి.
బోగీలు పడిపోయి ఉంటే పెను నష్టమే జరిగి ఉండేదంటూ జనం ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరికీ ఎలాంటి హాని జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బోగీలను తిరిగి పట్టాలపైకి ఎక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.
రైలు తక్కువ వేగంలో ఉండడం, లోకోపైలెట్ వేగంగా స్పందించి బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్ సమీపంలో రైలు పట్టాలు తప్పిందని, నాలుగు బోగీలు పట్టాలపై నుంచి పట్టాలు తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, వారందరినీ బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినట్లు అధికారులు తెలిపారు. బోగీలను హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ క్రమంలో విశాఖపట్నం – మహబూబ్‌నగర్ ట్రైన్‌ను బీబీనగర్ స్టేషన్‌లో నిలిపివేశామని, ఈ మార్గంలో నడిచే రైళ్లు ఆలస్యం కానున్నాయని అధికారులు వివరించారు.