Gold – Silver Prices | దిగివస్తున్న వెండి ధరలు..! స్థిరంగా బంగారం.. తులం హైదరాబాద్‌లో ఎంత ఉందంటే..?

Gold - Silver Prices | వరుసగా మూడురోజుల పాటు పెరిగిన బంగారం ధరలు శుక్రవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం రూ.56,950 వద్ద కొనసాగుతున్నది. ఇక 24 క్యారెట్ల తులం బంగారం రూ.62,130 వద్ద స్థిరపడింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,100, స్వచ్ఛమైన 24 క్యారెట్ల పసడి రూ.62,280 పలుకుతున్నది. ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.56,950 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి […]

Gold – Silver Prices | దిగివస్తున్న వెండి ధరలు..! స్థిరంగా బంగారం.. తులం హైదరాబాద్‌లో ఎంత ఉందంటే..?

Gold – Silver Prices | వరుసగా మూడురోజుల పాటు పెరిగిన బంగారం ధరలు శుక్రవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం రూ.56,950 వద్ద కొనసాగుతున్నది. ఇక 24 క్యారెట్ల తులం బంగారం రూ.62,130 వద్ద స్థిరపడింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,100, స్వచ్ఛమైన 24 క్యారెట్ల పసడి రూ.62,280 పలుకుతున్నది. ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.56,950 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,041300గా ఉన్నది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,370 ఉండగా.. 24 క్యారెట్ల పసడి రూ.62,590 వద్ద ట్రేడవుతున్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పుత్తడి రూ.56,950 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.62,130గా వద్ద కొనసాగుతున్నది.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీవ్యాప్తంగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు రోజు రోజుకు దిగి వస్తున్నాయి. శుక్రవారం కేజీ వెండిపై రూ.400 వరకు తగ్గింది.

హైదరాబాద్‌లో కిలో వెండి రూ.82వేలు పలుకుతున్నది. ఇక ప్లాటినం రేట్లు సైతం శుక్రవారం పడిపోయాయి. పది గ్రాముల ప్లాటినంపై రూ.10 తగ్గి.. తులానికి రూ.29,250 వద్ద ట్రేడవుతున్నది.