Gold Rates | మగువలకు శుభవార్త.. స్వల్పంగా తగ్గిన బంగారం..!

బంగారం ధరలు మగువలకు ఊరటకలిగించాయి. నిన్న స్థిరంగా కొనసాగిన ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి

Gold Rates | మగువలకు శుభవార్త.. స్వల్పంగా తగ్గిన బంగారం..!

Gold Rates | బంగారం ధరలు మగువలకు ఊరటకలిగించాయి. నిన్న స్థిరంగా కొనసాగిన ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్లపై బంగారంపై రూ.10 తగ్గి తులం రూ.57,190 పలుకుతున్నది. 24 క్యారెట్ల పసిడిపై సైతం రూ.10 రూ.62,390కి దిగివచ్చింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,790 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.63,040కి తగ్గింది.


ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,190 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.62,390కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.57,340 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,540కి పతనమైంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.57,190 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,390 పలుకుతున్నది.


ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు మళ్లీ వెండి ధర సైతం స్థిరంగానే ఉన్నది. మరో వైపు వెండి ధర సైతం స్వల్పంగా తగ్గింది. రూ.100 తగ్గి కిలో బంగారం ధర రూ.76,400 పలుకుతున్నది. హైదరాబాద్‌లో వెండి కిలో రూ.77.900 పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి.


ఈక్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.