Gold Rates | నిలకడగా బంగారం.. హైదరాబాద్‌ మార్కెట్‌లో నేటి ధరలు ఇవే..!

కొనుగోలుదారులకు బంగారం ధరలు ఊరటనిచ్చాయి. బులిమార్కెట్‌లో ధర నిలకడగా కొనసాగుతున్నది. 22 క్యారెట్ల గోల్డ్‌ తులానికి రూ.57,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.62,950 వద్ద కొనసాగుతున్నాయి

Gold Rates | నిలకడగా బంగారం.. హైదరాబాద్‌ మార్కెట్‌లో నేటి ధరలు ఇవే..!

Gold Rates | కొనుగోలుదారులకు బంగారం ధరలు ఊరటనిచ్చాయి. బులిమార్కెట్‌లో ధర నిలకడగా కొనసాగుతున్నది. 22 క్యారెట్ల గోల్డ్‌ తులానికి రూ.57,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.62,950 వద్ద కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు సైతం నిలకడగానే ఉన్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,490 వద్ద నిలకడగా ఉన్నది.


ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,950 వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.57,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,100 వద్ద ట్రేడవుతున్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.57,710 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.62,950 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి ధరలు సైతం నిలకడగా ఉన్నాయి.


హైదరాబాద్‌లో వెండి కిలోకు రూ.76,400 పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.