పసిడి మెరుపులు.. మరోసారి భారీగా పెరిగిన ధర..! ఏకంగా 65వేల మార్క్‌ దాటి..!

పసిడి జోరు కొనసాగుతున్నది. ఇటీవల పుత్తడి ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతూ రికార్డులు నమోదు చేస్తున్నది

పసిడి మెరుపులు.. మరోసారి భారీగా పెరిగిన ధర..! ఏకంగా 65వేల మార్క్‌ దాటి..!

విధాత‌: పసిడి జోరు కొనసాగుతున్నది. ఇటీవల పుత్తడి ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతూ రికార్డులు నమోదు చేస్తున్నది. ఫెడ్‌ పాలసీ రేట్‌ కట్స్‌పై నమ్మకంతో అంతర్జాతీయ విపణిలో బంగారం ధర 2.100 డాలర్ల మార్క్‌ను దాటి జీవకాల గరిష్ఠానికి చేరుకుంది. ఆ తర్వాత కాస్త దిగివచ్చింది. ప్రస్తుతం ఔన్స్‌కు 2,088 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. మరో వైపు దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్లు, ఇతర శుభాకార్యాలు కొనసాగుతున్నాయి.


ఈ క్రమంలో బంగారాన్ని భారీ డిమాండ్‌ ఉన్నది. ఈ నేపథ్యంలో మంగళవారం మార్కెట్‌లో పుత్తడి ధర పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.400 పెరిగి తులానికి రూ.58,850 పలుకుతున్నది. 24 క్యారెట్ల పసిడిపై రూ.440 పెరిగి తులానికి రూ.64,200కి పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నై నగరంలో బంగారం ధర రూ.65వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,750 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.65,180 పలుకుతున్నది.


ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.59వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 64,350కి పెరిగింది. ముంబయిలో రూ.58,850 ఉండగా.. రూ.64,200కి చేరింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.58,850 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.64,200 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు మార్కెట్‌లో వెండి ధర స్థిరంగా కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.83,500 పలుకుతున్నది.