Gold Prices: లకారం దాటిన బంగారం.. ఇక చేయక తప్పదు గుణకారం
బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. ప్రస్తుత ధరలు చూస్తే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇక బంగారం అందని ద్రాక్షగానే భావిస్తున్నారు. బంగారం ధర మంగళవారం ఏకంగా తులంకు రూ. 3వేలు పెరిగి లక్ష మార్కు దాటి ఇంకా పైపైకి వెలుతోంది.

Gold Prices: బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. ప్రస్తుత ధరలు చూస్తే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇక బంగారం అందని ద్రాక్షగానే భావిస్తున్నారు. బంగారం ధర మంగళవారం ఏకంగా తులంకు రూ. 3వేలు పెరిగి లక్ష మార్కు దాటి ఇంకా పైపైకి వెలుతోంది. గడిచిన 10రోజుల్లో ఏకంగా రూ.9,722పెరిగింది. మంగళవారం హైదరాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,750పెరిగి రూ.92,900కు చేరింది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.3వేలు పెరిగి రూ.1,01,350కి చేరింది.
బెంగుళూరులో , చైన్నై, ముంబాయ్ లో అదే ధరలు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లోలో రూ.93,050, రూ.1,01,500కు గా ఉంది. దుబాయ్ మార్కెట్ లో రూ.90,041, రూ.97,279గా ఉంది. అమెరికాలో రూ.87,622, రూ.93,577గా ఉంది. ఇక వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. కిలో వెండి రూ.1,11,00వద్ధ కొనసాగుతోంది. గత పది రోజులు వెండి ధర రూ.1000పెరిగింది.