Gold Rate | బంగారం కొనుగోలుదారులకు షాక్..! హైదరాబాద్‌లో తులానికి ఎంత పెరిగిందంటే..?
Gold Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు మరోసారి షాక్ ఇచ్చాయి. 22 క్యారెట్ల బంగారం రూ.300 వరకు పెరగ్గా.. 24 క్యారెట్ల పసడి ధర రూ.320 పెరుగుదల నమోదైంది. అయినా ధరలు రెండు నెలల కనిష్ఠ స్థాయిలోనే ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయం వెంటాడుతుండడంతో డాలర్ పుంజుకుంటున్నది. ఈ క్రమంలో బంగారం ధరలపై ప్రభావం పడుతున్నది. అయితే, […]

Gold Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు మరోసారి షాక్ ఇచ్చాయి. 22 క్యారెట్ల బంగారం రూ.300 వరకు పెరగ్గా.. 24 క్యారెట్ల పసడి ధర రూ.320 పెరుగుదల నమోదైంది. అయినా ధరలు రెండు నెలల కనిష్ఠ స్థాయిలోనే ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయం వెంటాడుతుండడంతో డాలర్ పుంజుకుంటున్నది. ఈ క్రమంలో బంగారం ధరలపై ప్రభావం పడుతున్నది. అయితే, రాబోయే రోజులు మాత్రం బంగారం ధరలు తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్‌కు 1965 డాలర్ల వద్ద, సిల్వర్ రేటు ఔన్సుకు 23.57 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.55,750 ఉండగా.. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.60,800 వద్ద ట్రేడవుతున్నది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం తులం రూ.55,600 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,650 పలుకుతున్నది. ఇక వెండి ధర సైతం భారీగానే పెరిగింది. కిలో వెండిపై రూ.500 వరకు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.78వేల వద్ద కొనసాగుతున్నది.