Gold Rate | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంత ఉందో తెలుసా?
Gold Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. నిన్న పెరిగిన ధరలు.. సోమవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసడి రూ.56,800 ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం రూ.61,950 వద్ద ట్రేడవుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి రూ.57,150, తులం 24 క్యారెట్ల బంగారం రూ.62,350గా ఉన్నది. ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల పసిడి రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 […]

Gold Rate |
బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. నిన్న పెరిగిన ధరలు.. సోమవారం స్థిరంగా కొనసాగుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసడి రూ.56,800 ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం రూ.61,950 వద్ద ట్రేడవుతున్నది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి రూ.57,150, తులం 24 క్యారెట్ల బంగారం రూ.62,350గా ఉన్నది.
ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల పసిడి రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ. 61,800 వద్ద కొనసాగుతున్నది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.61,800 వద్ద ట్రేడవుతున్నది.
విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు కొనసాగతున్నాయి. ఇక వెండి హైదరాబాద్‌లో కిలో రూ.78,500 పలుకుతున్నది.