Gold Rates | సామాన్యులకు షాక్.. స్వల్పంగా పెరిగిన బంగారం.. వెండి ఒకే రోజు రూ.1000పైపైకి..!
Gold Rates | బంగారం ధరలు సామాన్యులకు షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. బుధవారం మరోసారి పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.150 పెరిగి రూ.55,400కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 వరకు పెరిగి రూ.60,440కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,570కి ఎగిసింది. చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం […]

Gold Rates | బంగారం ధరలు సామాన్యులకు షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. బుధవారం మరోసారి పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.150 పెరిగి రూ.55,400కు చేరింది.
ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 వరకు పెరిగి రూ.60,440కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,570కి ఎగిసింది.
చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.55,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,760 వద్ద ట్రేడవుతున్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,400 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు ధర రూ.60,440 పలుకుతున్నది.
మరో వైపు మొన్నటి వరకు నిలకడగా ఉన్న వెండి ధరలు మరోసారి పెరిగాయి. కిలోకు ఒకే రోజు రూ.1000 వరకు పెరిగి కిలోకు రూ.78వేలు పలుకుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.81వేల వద్ద ట్రేడవుతున్నది.