Gold Rates | మగువలకు గుడ్‌న్యూస్‌.. దిగివచ్చిన బంగారం ధర..!

మగవులకు బంగారం ధరలు ఊరట కల్పించాయి. పసిడి, వెండి ధరలు దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారం రూ.200 తగ్గుముఖం పట్టగా.. తులం రూ.58,100కి తగ్గింది

Gold Rates | మగువలకు గుడ్‌న్యూస్‌.. దిగివచ్చిన బంగారం ధర..!

Gold Rates | మగవులకు బంగారం ధరలు ఊరట కల్పించాయి. పసిడి, వెండి ధరలు దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారం రూ.200 తగ్గుముఖం పట్టగా.. తులం రూ.58,100కి తగ్గింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.220 తగ్గగా.. తులం రూ.63,600కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.64,040కి దిగివచ్చింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.58,100 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.63,380కి చేరింది.


ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.58,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,530కి పతనమైంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.58,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.63,380 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. కిలోకు రూ.1000 వరకు దిగివచ్చింది. ప్రస్తుతం కిలోకు రూ.75,500 ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77వేలకి తగ్గింది. మరో వైపు ప్లాటినం ధర సైతం తగ్గింది. రూ.570 తగ్గి తులం రూ.23,780కి చేరింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.