Gold Rates | బంగారం కొనాలనుకుంటున్న వారికి బిగ్‌ రిలీఫ్‌..! హైదరాబాద్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rates | దేశంలో బంగారం పుత్తడి ధరలు స్థిరంగా శుక్రవారం కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం పసిడి రూ. 54,500 ఉండగా.. మరోవైపు 24 క్యారెట్ల బంగారం సైతం రూ.59,450 పలుకుతున్నది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,990 వద్ద నిలకడగా ఉన్నది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్​ […]

Gold Rates | బంగారం కొనాలనుకుంటున్న వారికి బిగ్‌ రిలీఫ్‌..! హైదరాబాద్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rates |

దేశంలో బంగారం పుత్తడి ధరలు స్థిరంగా శుక్రవారం కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం పసిడి రూ. 54,500 ఉండగా.. మరోవైపు 24 క్యారెట్ల బంగారం సైతం రూ.59,450 పలుకుతున్నది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,990 వద్ద నిలకడగా ఉన్నది.

ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్​ రూ.59,450 వద్ద ట్రేడవుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.54,800 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,780 వద్ద కొనసాగుతున్నది.

బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,450 వద్ద స్థిరంగా ఉన్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,450 పలుకున్నది.

ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు సైతం స్థిరంగానే కొనసాగుతున్నాయి.

కిలో వెండి రూ.73,500 పలుకుతుండగా.. హైదరాబాద్‌లో రూ.77,700 వద్ద ట్రేడ్‌ అవుతున్నది. అలాగే ప్లాటీనం ధరలు సైతం స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల ప్లాటీనంపై రూ.60 తగ్గి రూ.24వేలు పలుకుతున్నది.