Gold Rates | మగువలకు తీపికబురు.. నిలకడగా బంగారం.. భారీగా తగ్గిన వెండి..!
మగువలకు బంగారం ధరలు ఊరటనిస్తున్నాయి. బులియన్ మార్కెట్‌లో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి

Gold Rates | మగువలకు బంగారం ధరలు ఊరటనిస్తున్నాయి. బులియన్ మార్కెట్‌లో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల గోల్డ్ తులానికి రూ.58,750 వద్ద.. 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.64,090 వద్ద స్థిరంగా ఉన్నాయి. మరో వెపు వెండి ధర భారీగా పతనమైంది. కిలోకు రూ.1400 వరకు దిగివచ్చింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.59,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.64,800 వద్ద నిలకడగా ఉన్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.58,750 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.64,090కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.58,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.64,240 వద్ద ట్రేడవుతున్నది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.58,750 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.64,090 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి ధరలు సైతం నిలకడగా ఉన్నాయి. వెండి ధరలు సైతం భారీగా దిగివచ్చాయి. వెండి కిలోకు రూ.1400 తగ్గి కిలో రూ.73,600 ధర పలుకుతున్నది. హైదరాబాద్‌లో వెండి కిలోకు రూ.77వేలకు తగ్గింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.