Gold-Silver Price | మగువలకు షాక్‌..! రూ.60 వేలకు చేరువలో బంగారం.. కిలో రూ.80వేలకు చేరిన వెండి..!

Gold-Silver Price | అంతర్జాతీయ మార్కెట్‌లో యూఎస్‌ డాలర్‌ బలపడింది. దాంతో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్స్‌కు 1964 డాలర్లు పలుకుతున్నది. మరో వైపు దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.250 పెరిగి.. తులానికి రూ.54,700 పలుకుతున్నది. అదే సమయంలో 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.270 పెరిగి.. రూ.59,670కి చేరింది. అదే సమయంలో కిలో వెండిపై రూ.200 వరకు పెరుగుదల నమోదైంది. ఇక దేశంలోని వివిధ […]

Gold-Silver Price | మగువలకు షాక్‌..! రూ.60 వేలకు చేరువలో బంగారం.. కిలో రూ.80వేలకు చేరిన వెండి..!

Gold-Silver Price |

అంతర్జాతీయ మార్కెట్‌లో యూఎస్‌ డాలర్‌ బలపడింది. దాంతో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్స్‌కు 1964 డాలర్లు పలుకుతున్నది.

మరో వైపు దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.250 పెరిగి.. తులానికి రూ.54,700 పలుకుతున్నది.

అదే సమయంలో 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.270 పెరిగి.. రూ.59,670కి చేరింది. అదే సమయంలో కిలో వెండిపై రూ.200 వరకు పెరుగుదల నమోదైంది.

ఇక దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,670 వద్ద ట్రేడవుతున్నది.

ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,670 చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.55,200 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,220 పెరిగింది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.59,670 వద్ద కొనసాగుతున్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,670 పలుకున్నది. ఏ

పీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలతో పాటు తెలంగాణలో వరంగల్‌, కరీంనగర్‌ తదితర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

కిలో వెండిపై రూ.200 పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం కిలో వెండి హైదరాబాద్‌లో రూ.80వేలు పలుకుతున్నది.