Ayodhya | అయోధ్యలో బంగారు రామాయణం

Ayodhya | అయోధ్యలో బంగారు రామాయణం

విధాత : అయోధ్య బాల రాముడి గర్భగుడిలో బంగారు రామాయణాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రత్యేక బంగారు రామాయణాన్ని మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐఎఎస్‌ అధికారి సుబ్రమణ్యం లక్ష్మీనారాయణన్, సతీమణి సరస్వతిలు రామాలయ ట్రస్ట్‌కు అందించారు. శ్రీరామ నవరాత్రులలో మొదటి రోజున ఈ బంగారు రామాయణ ప్రతిష్ఠాపన జరిగింది. గర్భగుడిలోని రామ్‌లల్లా విగ్రహానికి 15 అడుగుల దూరంలో ఒక రాతి పీఠంపై ఈ రామాయణాన్ని ప్రతిష్ఠించారు.