Nagar Kurnool: నిఖిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి: ప్రవీణ్‌కుమార్
బాధిత కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలి.. బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ విధాత: నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు బాలికల గురుకుల పాఠశాలలో నిఖిత ఈనెల 6వ తేదిన ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థలాన్ని బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. తరగతి గదిని పరిశీలించి అనంతరం జరిగిన సంఘటన గురించి పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన […]

- బాధిత కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలి..
- బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్
విధాత: నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు బాలికల గురుకుల పాఠశాలలో నిఖిత ఈనెల 6వ తేదిన ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థలాన్ని బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు.
తరగతి గదిని పరిశీలించి అనంతరం జరిగిన సంఘటన గురించి పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎమోషనల్‌కు గురికాకుండా తమ సమస్యలను కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోవాలని సూచించారు. నిఖిత మరణం బాధాకరమని మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిఖిత మృతికి బాధ్యతగా స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిఖిత మృతికి సంతాపంగా రెండు నిమిషాలు విద్యార్థినిలతో కలిసి మౌనం పాటించారు.
విద్యార్థిని మృతదేహానికి అర్ధరాత్రి పోస్టుమార్టం చేసి ఆదర బాధరాగా అంత్యక్రియలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ప్రభుత్వ ఉగ్యోగం, మూడెకరాల భూమి ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత పై చూపిన శ్రద్ధలో ఒక వంతు గురుకుల పాఠశాల విద్యార్థిని విద్యార్థులపై చూపినట్లయితే పాఠశాలలు మెరుగ్గా ఉండేవని అన్నారు.