పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి జగదీశ్‌ రెడ్డి

విధాత, సీఎం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు పారిశ్రామిక ప్రగతికి పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేట వద్ద రైస్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమంతో ముడిపడి ఉన్న రైస్ ఇండస్ట్రీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. నల్గొండ జిల్లా రైస్ ఇండస్ట్రీలో ప్రఖ్యాతి గాంచిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భాస్కరరావు […]

  • By: krs    latest    Nov 11, 2022 11:23 AM IST
పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి జగదీశ్‌ రెడ్డి

విధాత, సీఎం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు పారిశ్రామిక ప్రగతికి పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేట వద్ద రైస్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమంతో ముడిపడి ఉన్న రైస్ ఇండస్ట్రీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. నల్గొండ జిల్లా రైస్ ఇండస్ట్రీలో ప్రఖ్యాతి గాంచిందన్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భాస్కరరావు ,శానంపూడి సైదిరెడ్డి, గాదరి కిషోర్ , కంచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, చిట్టిపోలు యాదగిరి, మున్సిపల్ చైర్ పర్సన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు