ఆ ‘రెవెన్యూ’ అధికారులపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం

విధాత‌: రెవెన్యూ శాఖలో పలువురు అధికారులపై విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వనపర్తి గోపాల్ పేట్ తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఎమ్మార్వో బి నరేందర్ పై వచ్చిన ఆరోపణలపై 10 రోజుల్లో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే గద్వాల్ ఆర్డీఓ కార్యాలయంలో పని చేసి రిటైర్డ్ తహసీల్దార్ బి. సత్తయ్యపై, కేటీ దొడ్డి మండల తహశీల్దార్ వి. సురేందర్, జోగులాంభ జిల్లా […]

  • By: krs    latest    Nov 11, 2022 1:50 AM IST
ఆ ‘రెవెన్యూ’ అధికారులపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం

విధాత‌: రెవెన్యూ శాఖలో పలువురు అధికారులపై విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వనపర్తి గోపాల్ పేట్ తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఎమ్మార్వో బి నరేందర్ పై వచ్చిన ఆరోపణలపై 10 రోజుల్లో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

అలాగే గద్వాల్ ఆర్డీఓ కార్యాలయంలో పని చేసి రిటైర్డ్ తహసీల్దార్ బి. సత్తయ్యపై, కేటీ దొడ్డి మండల తహశీల్దార్ వి. సురేందర్, జోగులాంభ జిల్లా కలెక్టరేట్‌లో ఈ-సెక్షన్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న సమయంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఆర్ రాజు, ప్రస్తుతం ఆడిషల్ కలెక్టర్ హోదాలో పని చేస్తున్న అబ్ధుల్ హమీద్ గతంలో జనగామలో ఆర్డీవోగా పని చేసిన సమయంలో వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.