యాదాద్రి పాతగుట్టలో ఘనంగా తిరుమంజసం, పరమపదోత్సవం
31నుండి పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు స్వామివారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి విధాత: యాదగిరిగుట్ట దేవస్థానం అనుబంధ ఆలయం పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం తిరుమంజసం, సాయంత్రం పరమపదోత్సవం కార్యక్రమాలను పాంచరాత్రాగమ శాస్త్రానుసారం వేద పండిత బృందం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అధ్యయనోత్సవాలలో రేపు సోమవారం నూత్తందారి చాత్మరా కార్యక్రమంతో అధ్యయనోత్సవాలు ముగియనున్నాయి. అనంతరం ఈ నెల 31నుండి వచ్చే నెల […]

- 31నుండి పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు
- స్వామివారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి
విధాత: యాదగిరిగుట్ట దేవస్థానం అనుబంధ ఆలయం పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం తిరుమంజసం, సాయంత్రం పరమపదోత్సవం కార్యక్రమాలను పాంచరాత్రాగమ శాస్త్రానుసారం వేద పండిత బృందం ఘనంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అధ్యయనోత్సవాలలో రేపు సోమవారం నూత్తందారి చాత్మరా కార్యక్రమంతో అధ్యయనోత్సవాలు ముగియనున్నాయి. అనంతరం ఈ నెల 31నుండి వచ్చే నెల ఫిబ్రవరి 6 వ తేదీ వరకు ఏడు రోజుల పాటు పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.
కాగా ఆదివారం సెలవు దినం సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుడి ఆలయానికి భారీగా తరలివచ్చారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి ఆదివారం 45లక్షల 56,920 రూపాయల ఆదాయం సమకూరింది.