Green Card | తీరనున్న అమెరికా గ్రీన్ కార్డు కష్టాలు
ఈగిల్ చట్టంతో ప్రతిభ ఆధారిత గ్రీన్ కార్డుల జారీకి అమెరికా ఆలోచన విధాత: భారతీయులకు తీపి కబురు. ఇన్నాళ్లుగా అమెరికాలో దేశాల వారీగా ఉన్న గ్రీన్ కార్డు కోటావిధానం రద్దు కానున్నది. ప్రతిభ ఆధారంగా గ్రీన్ కార్డు ఇచ్చేందుకు ఈగిల్ చట్టం తీసుకురావడానికి అమెరికా ఆలోచిస్తున్నది. ఇందుకు ప్రత్యేకంగా హెచ్ ఆర్-3648 అనే చట్టాన్ని తేనున్నది. గ్రీన్ కార్డు అంటే.. అమెరికాలో శాశ్వత నివాసం ఉండటానికి అవసరమైన అధికార పత్రం. ఇప్పటి దాకా దీన్ని అమెరికాలో దేశాల […]

- ఈగిల్ చట్టంతో ప్రతిభ ఆధారిత గ్రీన్ కార్డుల జారీకి అమెరికా ఆలోచన
విధాత: భారతీయులకు తీపి కబురు. ఇన్నాళ్లుగా అమెరికాలో దేశాల వారీగా ఉన్న గ్రీన్ కార్డు కోటావిధానం రద్దు కానున్నది. ప్రతిభ ఆధారంగా గ్రీన్ కార్డు ఇచ్చేందుకు ఈగిల్ చట్టం తీసుకురావడానికి అమెరికా ఆలోచిస్తున్నది. ఇందుకు ప్రత్యేకంగా హెచ్ ఆర్-3648 అనే చట్టాన్ని తేనున్నది.
గ్రీన్ కార్డు అంటే..
అమెరికాలో శాశ్వత నివాసం ఉండటానికి అవసరమైన అధికార పత్రం. ఇప్పటి దాకా దీన్ని అమెరికాలో దేశాల వారీగా కొన్ని చొప్పున కేటాయిస్తున్నారు. అయితే ఈ కోటా కింద కొన్ని దేశాల నుంచి వచ్చే వారే ఉండటం లేదు. మరో వైపు కొన్ని దేశాల నుంచి విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం వచ్చే వారి సంఖ్య ఎన్నో రెట్లు ఉంటున్నది. ముఖ్యంగా భారత్ నుంచి ఏటా ఉన్నత చదువుల కోసమని లక్షల సంఖ్యలో అమెరికా వెళ్తున్నారు. ఆ క్రమంలో అక్కడ ఉన్నత చదువులు అయిపోయి ఉపాధి పొందిన తర్వాత అక్కడనే ఉండాలంటే గ్రీన్ కార్డు పెద్ద అవరోధంగా ఉంటున్నది. ఇప్పుడు ఈ సమస్య ఈగిల్ చట్టంతో తీరనున్నది.
ఎన్నో ఏండ్లుగా భారతీయులు ఇలాంటి చట్టం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రతిభ ఆధారంగా , దేశాల వారీ కోటా ఎత్తి వేసి గ్రీన్ కార్డు ఇవ్వాలను కోవటం ఆహ్వానించదగినదని అమెరికాలోని భారతీయులు అంటున్నారు. దేశాల వారీ కోటా ఎత్తి వేసి ప్రతిభ ఆధారిత గ్రీన్ కార్డు విధానానికి చట్ట రూపం ఇచ్చేందుకు అమెరికా పార్లమెంటులోని దిగువ సభలో ఈగిల్ చట్టం ఆమోదం పొందాల్సిన అవసరం ఉన్నది. ఇది అనతి కాలంలోనే చట్ట రూపం తీసుకొంటుందని భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.