Groom Escape| పెళ్లయిన మరుసటి రోజే.. నవ వధువును నడిరోడ్డుపై వదిలి పరారైన వరుడు..! అసలు ఏం జరిగిందో తెలిస్తే షాకవుతారు..!

Groom Escape | పెళ్లయిన మరునాడే నవ వధువును నడిరోడ్డుపై వదిలి పరారయ్యాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన కర్ణాటక మహాదేవపూర్‌లో చోటు చేసుకున్నది. కొత్త పెళ్లి కూతురు భర్త కోసం దాదాపు రెండువారాలు వెతికింది. ఎంతకీ ఆచూకీ దొరక్కపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టగా.. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు మహదేవ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన జార్జ్‌ (26) అనే […]

Groom Escape| పెళ్లయిన మరుసటి రోజే.. నవ వధువును నడిరోడ్డుపై వదిలి పరారైన వరుడు..! అసలు ఏం జరిగిందో తెలిస్తే షాకవుతారు..!

Groom Escape | పెళ్లయిన మరునాడే నవ వధువును నడిరోడ్డుపై వదిలి పరారయ్యాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన కర్ణాటక మహాదేవపూర్‌లో చోటు చేసుకున్నది. కొత్త పెళ్లి కూతురు భర్త కోసం దాదాపు రెండువారాలు వెతికింది. ఎంతకీ ఆచూకీ దొరక్కపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టగా.. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు మహదేవ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన జార్జ్‌ (26) అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన 22 సంవత్సరాల యువతితో ఫిబ్రవరి 15న వివాహం జరిగింది.

పెళ్లయిన మరుసటి రోజున కొత్త దంపతులు చర్చికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై ఓ చోట భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. అదే సమయంలో పెళ్లి కొడుకు జార్క్‌ కారు దిగి పరారయ్యాడు. ఈ ఘటనతో కొత్త పెళ్లి కూతురు షాక్‌కు గురైంది. వెంటనే తేరుకొని అతన్ని వెంబడించేందుకు ప్రయత్నించింది. అయితే, జార్జ్‌ ఆమెకు దొరకకుండా తప్పించుకొని పారిపోయాడు. ఆ తర్వాత జార్జ్‌ కుటుంబంతో పాటు వధువు కుటుంబ సభ్యులు కలిసి గాలింపు చేపట్టారు. ఆచూకీ లభించకపోవడంతో చివరగా ఈ నెల 5న బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.

మాజీ ప్రియురాలి వేధింపులతోనే..

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జార్జ్‌ గోవాలోని ఓ కంపెనీలో పని చేస్తున్న సమయంలో సహోద్యోగిగా ఉన్న డ్రైవర్‌ భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరు పిల్లలున్న ఆ మహిళ సైతం అదే కంపెనీలో క్లర్క్‌గా పని చేసేది. ఈ విషయం జార్జ్‌ తల్లికి తెలియంతో.. అతనికి వేరే పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. అలాగే సదరు మహిళతో సంబంధానికి స్వస్తి చెప్పాలని చెప్పింది. అయితే, తల్లి మాటలను పెడచెవిన పెట్టి.. సదరు మహిళతో సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని జార్జ్​కు కాబోయే భార్యకు సైతం అతని తల్లి వివరించింది.

మహిళతో సంబంధం కొనసాగించనని కాబోయే భార్యకు జార్జ్‌ హామీ ఇచ్చాడు. అతనిపై నమ్మకంతో సదరు యువతి పెళ్లికి అంగీకరించింది. ఆ తర్వాత జార్జ్‌కు పెళ్లి నిశ్చియమైందని సదరు మహిళకు తెలిసింది. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలను బహిర్గతం చేస్తానని జార్జ్‌ను బెదిరించింది. ఈ విషయాన్ని సైతం తన కాబోయే భార్యకు చెప్పాడు. ఆమె ఈ విషయంలో తల్లిదండ్రుల నుంచి కావాల్సిన సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చింది. మాజీ ప్రేయురాలి వేధింపులు తాళలేక పెళ్లయిన మరుసటి రోజే జార్జ్‌ పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, జార్జ్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.