Group-1 | గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదాకు ధర్మాసనం నిరాకరణ

Group-1 విధాత: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదాకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఎల్లుండి జరగనున్న ప్రిలిమ్స్‌ పరీక్షలో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. అప్పీల్‌ను కొట్టివేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ వాయిదా వేయాలన్న పిటిషన్లను ఇటీవల సింగిల్‌ జడ్జి కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఉత్వర్వులను సవాల్‌ చేస్తూ ఓ విద్యార్థి ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అభినంద్‌ కుమార్‌ షావిలి, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌ రావుతో కూడిన హైకోర్టు ధర్మాసనం ప్రిలిమ్స్‌ […]

Group-1 | గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదాకు ధర్మాసనం నిరాకరణ

Group-1

విధాత: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదాకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఎల్లుండి జరగనున్న ప్రిలిమ్స్‌ పరీక్షలో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. అప్పీల్‌ను కొట్టివేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ వాయిదా వేయాలన్న పిటిషన్లను ఇటీవల సింగిల్‌ జడ్జి కొట్టివేసిన సంగతి తెలిసిందే.

అయితే.. ఉత్వర్వులను సవాల్‌ చేస్తూ ఓ విద్యార్థి ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అభినంద్‌ కుమార్‌ షావిలి, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌ రావుతో కూడిన హైకోర్టు ధర్మాసనం ప్రిలిమ్స్‌ పరీక్షను నిలిపివేయడం పరిష్కారం కాదని అభిప్రాయపడింది.

దీంతో ఎల్లుండి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. పరీక్ష నిర్వహణ కోసం సర్వీస్ కమిషన్‌ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హాల్‌ టికెట్లను కూడా వెబ్‌సైట్ పెట్టింది. పరీక్ష హాలుకు చేరుకునే ముందు అభ్యర్థులకు తగిన సూచనలు కూడా చేసింది. వాటికి సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.