రేవంత్ పాదయాత్రతో BRSలో గుబులు.. అందుకే దాడులు: కుంభం అనిల్
విధాత: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి అధికారం కోల్పోతామన్న బెంగతో బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారని, యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో బిఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతు ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారన్నారు. పాదయాత్ర తో కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న ఆదరణ చూసి […]

విధాత: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి అధికారం కోల్పోతామన్న బెంగతో బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారని, యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.
బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో బిఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతు ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారన్నారు. పాదయాత్ర తో కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న ఆదరణ చూసి దాడులు చేస్తున్నారని, ఇది సమంజసం కాదని, రానున్న రోజుల్లో దౌర్జన్యకర రాజకీయాలు సాగిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నా యన్నారు. త్వరలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని, ప్రజా సమస్యలపై ప్రజలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటు రాకపోవడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
స్థానిక ఎమ్మెల్యే పైళ్ల జిల్లా కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి తీసుకురాలేకపోయారని విమర్శించారు. నాసిరకమైన సిసి రోడ్లు నిర్మిస్తున్నారన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు గత మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కంకల కిష్టయ్య, ఎంపీపీ నూతి రమేష్, మాజీ ఎంపీపీ తుమ్మల నరసయ్య, మాజీ ఎంపిటిసి పల్సం సతీష్, బత్తిని లింగయ, గంగాపురం దైవాదినం, బత్తిని సహదేవ్, కాసుల వెంకటేశం, బద్దం సంజీవరెడ్డి, కొండూరు సాయి, పాలకుర్ల్ వెంకటేశం, కీర్త రమేష్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.