నాలుగైదు రోజుల్లో గురుకుల నోటిఫికేషన్లు!
విధాత: గురుకుల నియామక బోర్డు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పనున్నది. గురుకులాల్లో టీచింగ్ పోస్టుల భర్తీ కోసం గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు కసరత్తు ప్రారంభించింది. ఇటీవల బీసీ గురుకులాల్లోని అదనపు పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన విషయం విదితమే. దీంతో గురుకులాల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య 11,105కు చేరింది. న్యాయ వివాదాల పరిధిలో ఉన్న పీఈటీ, పీడీ తదితర పోస్టులను మినహాయించి మిగతా పోస్టులకు వీలైనంత తర్వరగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని బోర్టు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. […]

విధాత: గురుకుల నియామక బోర్డు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పనున్నది. గురుకులాల్లో టీచింగ్ పోస్టుల భర్తీ కోసం గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు కసరత్తు ప్రారంభించింది. ఇటీవల బీసీ గురుకులాల్లోని అదనపు పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన విషయం విదితమే.
దీంతో గురుకులాల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య 11,105కు చేరింది. న్యాయ వివాదాల పరిధిలో ఉన్న పీఈటీ, పీడీ తదితర పోస్టులను మినహాయించి మిగతా పోస్టులకు వీలైనంత తర్వరగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని బోర్టు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
నాలుగైదు రోజుల్లో సుమారు 6 వేల పోస్టులకు పైగా ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. దరఖాస్తు స్వీకరణకు నెల నుంచి 45 రోజుల టైం ఇచ్చి, తర్వాత ప్రిపరేషన్ కోసం తగిన సమయం ఇచ్చి రాత పరీక్షలు నిర్వహించనున్నది. 2023-24 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నియామకాలు పూర్తిచేయడానికి కార్యచరణ సిద్ధం చేస్తున్నది.