రేవంత్ పాలన బాగుంది.. జమిలి సమర్ధనీయమే
రాష్ట్రంలో సీఎం రేంవత్‌రెడ్డి పాలన బాగుందని ప్రజలు భావిస్తున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

- మండలి చైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు
విధాత: రాష్ట్రంలో సీఎం రేంవత్‌రెడ్డి పాలన బాగుందని ప్రజలు భావిస్తున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ జమిలి ఎన్నిక విధానం సమర్థనీయమేనని, మరింత లోతుగా అధ్యయనం చేస్తే బాగుంటుందన్నారు. కాంగ్రెస్‌లో చేరాలని నా కుమారుడు అమిత్‌కు ఆ పార్టీ నేతల నుంచి ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమేనని, దీనిపై ఎలాంటి చర్చలు జరగలేదన్నారు.
బీఆరెస్ పార్టీలో కొందరు నేతలు సహకరించకపోవడంతోనే పోటీ చేయవద్దని అమిత్ నిర్ణయించుకున్నారని తెలిపారు. పార్టీ అధిష్టానం రెండు నెలల ముందు అమిత్‌ను అభ్యర్థిగా ప్రకటించి ఉంటే బాగుండేదని, నేను పలు మార్లు ఆహ్వానిస్తేనే గతంలో బీఆరెస్‌లోకి వచ్చానన్నారు. సీఎం రేవంతరెడ్డి నాకు బంధువైనప్పటికి తాను అసెంబ్లీ సమావేశాల్లో మినహా ఆయనను ఎక్కడ కలవ లేదని గుత్తా స్పష్టం చేశారు. ఏ పార్టీకి సంబంధం లేని రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నానని, ఏ పార్టీ కండువా కప్పుకోవాల్సిన అవసరం నాకు లేదన్నారు.