Harvester | అతి వేగంతో బాలుడిని ఢీకొట్టిన హార్వెస్టర్.. చచ్చడా..? బతికాడా..?
Harvester విధాత: ఓ బాలుడిని అతి వేగంతో దూసుకొచ్చిన హార్వెస్టర్(Harvester) ఢీకొట్టింది. బాలుడు గాల్లోకి ఎగిరి అదే హార్వెస్టర్ కింద పడిపోయాడు. ఆ వాహనం మాత్రం ముందుకు దూసుకెళ్లింది. అక్కడే ఉన్న తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. హార్వెస్టర్ కింద పడ్డ బాలుడిని తల్లి దగ్గరకు తీసుకుంది. తీవ్ర గాయాల పాలైన ఆ పిల్లాడిని ఆస్పత్రికి తరలించారు. బాలుడిని హార్వెస్టర్(Harvester) ఢీకొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన చైనాలోని బోజ్‌హు ఏరియాలో 2021లో చోటు […]

Harvester
విధాత: ఓ బాలుడిని అతి వేగంతో దూసుకొచ్చిన హార్వెస్టర్(Harvester) ఢీకొట్టింది. బాలుడు గాల్లోకి ఎగిరి అదే హార్వెస్టర్ కింద పడిపోయాడు. ఆ వాహనం మాత్రం ముందుకు దూసుకెళ్లింది. అక్కడే ఉన్న తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు.
హార్వెస్టర్ కింద పడ్డ బాలుడిని తల్లి దగ్గరకు తీసుకుంది. తీవ్ర గాయాల పాలైన ఆ పిల్లాడిని ఆస్పత్రికి తరలించారు. బాలుడిని హార్వెస్టర్(Harvester) ఢీకొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన చైనాలోని బోజ్‌హు ఏరియాలో 2021లో చోటు చేసుకోగా, ప్రస్తుతం ఆ వీడియో ట్రెండ్ అవుతోంది.
A very lucky kid from China pic.twitter.com/Smx6XNkUfG
— CCTV IDIOTS (@cctvidiots) April 19, 2023
అయితే బాలుడు తండ్రి ధాన్యం ఆరబెడుతుండగా, అతనికి కుమారుడు హెల్ప్ చేస్తున్నాడు. రోడ్డుకు అవతలి వైపులో తల్లి ఉండటంతో.. బాలుడు వేగంగా పరుగెత్తాడు. హార్వెస్టర్(Harvester)ను గమనించలేదు. హార్వెస్టర్ కూడా వేగంగా బాలుడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలైనప్పటికీ, బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.