‘హాత్ సే హాత్’ జోడో యాత్ర షెడ్యూల్ విడుద‌ల‌

ములుగు జిల్లాలో రెండ్రోజుల పాద‌యాత్ర వివ‌రాలు వెల్ల‌డి రెండు రోజులు రేవంత్ రెడ్డి పాదయాత్ర పోలీసు అనుమతి కోరిన ఎమ్మెల్యే సీతక్క మూడవరోజు షెడ్యూల్ తదుపరి వెల్లడి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఈ నెల 6వ‌ తేదీన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నుంచి ప్రారంభం కానున్నది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ పాద యాత్ర స్వయంగా నిర్వహిస్తున్నారు. రాహుల్ […]

‘హాత్ సే హాత్’ జోడో యాత్ర షెడ్యూల్ విడుద‌ల‌
  • ములుగు జిల్లాలో రెండ్రోజుల పాద‌యాత్ర వివ‌రాలు వెల్ల‌డి
  • రెండు రోజులు రేవంత్ రెడ్డి పాదయాత్ర
  • పోలీసు అనుమతి కోరిన ఎమ్మెల్యే సీతక్క
  • మూడవరోజు షెడ్యూల్ తదుపరి వెల్లడి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఈ నెల 6వ‌ తేదీన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నుంచి ప్రారంభం కానున్నది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ పాద యాత్ర స్వయంగా నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన జోడోయాత్ర ముగిసిన నేపథ్యంలో తాజాగా ఈ హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నిర్ణయంలో భాగంగా ముందుగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో యాత్ర ప్రారంభించేందుకు ఇప్పటికే సకల సన్నాహాలు చేశారు.

ఈ మేరకు యాత్ర షెడ్యూల్ ను ములుగు ఎమ్మెల్యే సీతక్క శనివారం విడుదల చేశారు. యాత్రకు సంబంధించిన అనుమతి కోరుతూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని విన్నవిస్తూ ములుగు జిల్లా పోలీస్ అధికారులను ఎమ్మెల్యే కోరారు.

పాదయాత్ర షెడ్యూల్ వివరాలు

6వ తేదీన మేడారం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర రెండు రోజులపాటు ములుగు జిల్లాలో సాగనున్నది. ఈ రెండు రోజుల షెడ్యూల్ ను ఎమ్మెల్యే విడుదల చేశారు. ఇప్పటికే పాదయాత్రకు సంబంధించిన పోస్టర్లు జిల్లా కాంగ్రెస్ నేతలు ఆవిష్కరించారు.

తొలిరోజు ఉదయం 11 గంటలకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క, సారలమ్మ లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మేడారం నుంచి పాద యాత్ర ప్రారంభిస్తారు. కొత్తూరు, నార్లాపూర్ మీదుగా ప్రాజెక్టు నగర్ చేరుకుంటారు. ప్రాజెక్టునగర్లో మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేశారు. భోజనం అనంతరం యాత్ర ప్రారంభించి పస్రా చేరుకుంటారు. టి విరామానంతరం సాయంత్రం 5 గంటలకు పస్రా లో గంటపాటు కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. అనంతరం పస్రా, గోవిందరావుపేట, చల్వాయి, మచ్చాపూర్, జవహర్ నగర్, జంగాలపల్లి క్రాస్ రోడ్ మీదుగా ఇంచర్ల, వెంకటాపూర్ క్రాస్ రోడ్ మీదుగా రాత్రి 8 గంటలకు పాలంపేట చేరుకుంటారు. పాలంపేటలో రాత్రి బస చేస్తారు.

రెండవరోజు యాత్ర వివరాలు

రెండవ రోజు 7వ‌ తేదీ ఉదయం 8 గంటలకు రామప్ప దేవాలయంలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం రామప్ప నుంచి యాత్ర ప్రారంభించి రామానుజాపురం, చెంచు కాలనీ, నారాయణగిరి పల్లె మీదుగా మధ్యాహ్నం బుద్ధారం చేరుకుంటారు. బుద్ధారం – చేతరాజు పల్లి మధ్య మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం యాత్ర చేపట్టి సాయంత్రం 6 గంటల వరకు కేశవాపురం, బండారుపల్లి మీదుగా ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు.

అనంతరం రాత్రి 8 గంటల వరకు ములుగు గాంధీ పార్క్ సెంటర్లో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. రాత్రి ములుగులో బస అనంతరం మూడవరోజు యాత్ర కొనసాగించనున్నట్లు సీతక్క తెలిపారు. అయితే ప్రస్తుతానికి రెండు రోజుల షెడ్యూల్ మాత్రమే ప్రకటించారు. యాత్ర వివరాలను తదుపరి వెల్లడించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.