Viral Video | వామ్మో దెయ్యం.. వీడియో వైరల్‌..!

Viral Video | ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం కొంత పుంతలు తొక్కుతున్నది. మనిషి అంతరిక్షాన్ని చుట్టివస్తున్నాడు. విశ్వం పుట్టుకక సంబంధించిన ఆధారాలను అన్వేషిస్తున్నాడు. ఈ రోజుల్లో ఇంకా దెయ్యాలున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఇలా చాలా మంది దెయ్యాలున్నాయని, తాము వాటిని చూశామంటూ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఓ జంట సైతం తాము దెయ్యాన్ని చూశామని, వీడియో కూడా తీశామని పేర్కొన్నారు. తాజాగా యూకేకు చెందిన హన్నా రోవెట్ (52), ఆమె భర్త డేవ్ తమ […]

Viral Video | వామ్మో దెయ్యం.. వీడియో వైరల్‌..!

Viral Video | ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం కొంత పుంతలు తొక్కుతున్నది. మనిషి అంతరిక్షాన్ని చుట్టివస్తున్నాడు. విశ్వం పుట్టుకక సంబంధించిన ఆధారాలను అన్వేషిస్తున్నాడు. ఈ రోజుల్లో ఇంకా దెయ్యాలున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఇలా చాలా మంది దెయ్యాలున్నాయని, తాము వాటిని చూశామంటూ చెప్పిన విషయం తెలిసిందే.

తాజాగా ఓ జంట సైతం తాము దెయ్యాన్ని చూశామని, వీడియో కూడా తీశామని పేర్కొన్నారు. తాజాగా యూకేకు చెందిన హన్నా రోవెట్ (52), ఆమె భర్త డేవ్ తమ ఇంటి సమీపంలోని క్లంబర్ పార్క్‌లో రాత్రి పూట పెంపుడు కుక్కను వెంట పెట్టుకొని సరదాగా వాకింగ్‌కు వెళ్లారు. కొద్ది దూరం నడిచిన తర్వాత ఈ జంటకు ఊహించని సంఘటన ఎదురైంది. ఉన్నట్టుంది వింత ఆకారాలు కనిపించాయి.

ఈ హఠాత్‌ పరిణామంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే వాస్తవాన్ని గ్రహించి వెంటనే సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. వీడియోలో పొగ ఆకారాలు కదులున్న దృష్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పొగ ఆకారాలు స్పష్టంగా కనిపించనప్పటికీ.. పొడవాటి తోకతో నేలపై నడుచుకుంటూ వెళ్లడం వీడియోలో కనిపించింది.

ఈ సందర్భంగా హన్నా మీడియాతో మాట్లాడుతూ.. తొలుత ఆకారాన్ని చూసి కుక్క భావించామని, తీక్షణంగా చూడడగా మానవ రూపంలో ఓ ఆకారం చనిపించిందని చెప్పుకొచ్చారు. కుక్క కాదని తెలుసుకున్న తర్వాత సెల్‌ఫోన్‌లో వీడియో తీశామని, పొడవాటి అవయవాలతో కదులుతున్న పొగ మాదిరి కనిపించిందని, టార్చ్‌ లైట్‌తో వీడియో తీస్తూ వెంబడించామని, మాకు ఎలాంటి భయం అనిపించలేదని పేర్కొన్నారు. ఇలాంటివి ఎవరికైనా చెబితే నవ్వుతారని, అందుకే వీడియో తీశామని చెప్పుకువచ్చారు.