Jayasudha | జయసుధలో ఈ టాలెంట్ చూశారా.. ఘటికురాలే!

విధాత: జయసుధ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కరలేదు. ఒకప్పుడు హీరోయిన్‌గా స్టార్ స్టేటస్‌ని అనుభవించిన జయసుధ.. తన కెరియర్‌లో సహజనటిగా మంచి గుర్తింపును పొందింది. హీరోయిన్‌గా స్టార్ హీరోల సరసన నటించి.. తిరుగులేని స్టార్‌డమ్‌ని సొంతం చేసుకుంది. అనంతరం పెళ్లి, పిల్లలు వంటి ఘట్టాలు పూర్తయిన తర్వాత కూడా జయసుధ యాక్టింగ్ మానలేదు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అమ్మ, అత్త, అమ్మమ్మ పాత్రలలో నటిస్తూ.. ఇప్పటికీ తన యాక్టింగ్ టాలెంట్‌ని నిరూపించుకుంటోంది. అయితే భర్త చనిపోయిన తర్వాత.. కాస్త గ్యాప్ ఇచ్చిన జయసుధ.. ఇప్పుడు మళ్లీ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారింది. మరోవైపు పాలిటిక్స్‌లోనూ తన పేరు వినబడేలా చేసుకుంటుంది.
అయితే ఏ పార్టీలో తను ఉందో చెప్పడం కష్టం అనేలా.. పార్టీలు మారుతూనే ఉంది. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉంది. ఇంతకు ముందు వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉంది. రీసెంట్‌గానే బీజేపీ తీర్థం పుచ్చుకున్న జయసుధ.. రాబోయే ఎలక్షన్స్‌లో తెలంగాణ నుంచి లేదంటే ఏపీ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగే ప్రయత్నాల్లో ఉంది.
సరే ఆ సంగతి పక్కన పెడితే.. జయసుధ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనే వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె సింగర్‌గా తన టాలెంట్ చూపిస్తోంది. వీడియో పాతదే అయినా.. జయసుధలోని టాలెంట్ ఇదంటూ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
వాస్తవానికి ఈ మధ్య అమెరికాలో ఉండి వచ్చిన జయసుధ.. అక్కడి నుంచి వచ్చిన తర్వాత దర్శకురాలిగా మెగా ఫోన్ పట్టాలని అనుకుంది. కొన్ని కథలు కూడా సిద్ధం చేసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా స్ట్రీట్ చిల్డ్రన్స్ మీద, పేద ప్రేజల మీద ఓ డాక్యుమెంటరీ చేయాలని చూస్తున్నట్లుగా కూడా ఆమె చెప్పుకొచ్చారు.
మరి అది ఎంత వరకు వచ్చిందనేది తెలియదు కానీ.. ప్రస్తుతం అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ అలాగే పాలిటిక్స్‌పై ఆమె దృష్టి పెట్టినట్లుగా అయితే తెలుస్తోంది. ఇక జయసుధ పాడిన పాట విషయానికి వస్తే.. ఆమె ఎప్పుడో క్రిస్టియానిటీ తీసుకున్న విషయం తెలిసిందే. జీసస్‌కు చెందిన పాటలను ఆమె ఒక ప్రొఫెషనల్ సింగర్‌గా ఆలపించడం విశేషంగా చెప్పుకోవాలి. అందుకే జయసుధని చూసిన వారంతా.. ఘటికురాలే అంటూ ప్రశంసిస్తున్నారు.