Heart Attack | ములుగు జడ్పీ చైర్మన్ గుండెపోటుతో మృతి

Heart Attack హాస్పిటల్లో చికిత్సపొందుతూ మృతి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్(50)హఠాన్మరణం చెందారు. హన్మకొండలోని నివాసంలో ఆదివారం గుండెపోటుకు గురైన ఆయనను ములుగు రోడ్డు లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఇంట్లోనే పడిపోగా హాస్పటల్ కి తరలించారు. అప్పుడు చికిత్స చేయడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం మరోసారి గుండెపోటుకు గురి కావడంతో ఆయన మృత్యువాత పడ్డాడని సమీప బంధువులు తెలిపారు. […]

  • Publish Date - June 11, 2023 / 06:59 AM IST

Heart Attack

  • హాస్పిటల్లో చికిత్సపొందుతూ మృతి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్(50)హఠాన్మరణం చెందారు. హన్మకొండలోని నివాసంలో ఆదివారం గుండెపోటుకు గురైన ఆయనను ములుగు రోడ్డు లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు.

కొద్ది రోజుల క్రితం ఇంట్లోనే పడిపోగా హాస్పటల్ కి తరలించారు. అప్పుడు చికిత్స చేయడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం మరోసారి గుండెపోటుకు గురి కావడంతో ఆయన మృత్యువాత పడ్డాడని సమీప బంధువులు తెలిపారు.

ఏటూర్ నాగారం జడ్పిటిసి గా ఎన్నికైన జగదీష్ ములుగు జడ్పీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జిగా కూడా కొనసాగుతున్నారు. మొన్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కేటీఆర్ హాజరైన కార్యక్రమంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. ఈలోపే ఈ విషాదం జరగడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. గులాబీ వర్గాలు షాక్‌కు లోనయ్యాయి.