CPR: బతికించాలన్న ఆశ.. ఆగిపోయింది శ్వాస! కారు డ్రైవ్ చేస్తుండగా గుండె పోటు.. CPR చేసిన సీఐ.. అయినా దక్కని ప్రాణం

ప్రాణం పోయింది.. మానవత్వం బతికింది విధాత: హైద్రాబాద్ శివారులోని పెద్ద అంబర్ పేట ప్రాంతంలో ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేస్తుండగా హఠాత్తుగా గుండె పోటుకు గురయ్యాడు. కారులోనే కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అతడిని అటుగా వెళ్తున్న రామన్నపేట సీఐ మోతీరాం గమనించాడు. CPR: బతికించాలన్న ఆశ.. ఆగిపోయింది శ్వాస! కారు డ్రైవ్ చేస్తుండగా గుండె పోటు.. CPR చేసిన సీఐ.. అయినా దక్కని ప్రాణం | Vidhaatha | Latest Telugu Newshttps://t.co/q6VNWXyFKW #CPR #Telangana […]

CPR: బతికించాలన్న ఆశ.. ఆగిపోయింది శ్వాస! కారు డ్రైవ్ చేస్తుండగా గుండె పోటు.. CPR చేసిన సీఐ.. అయినా దక్కని ప్రాణం

ప్రాణం పోయింది.. మానవత్వం బతికింది

విధాత: హైద్రాబాద్ శివారులోని పెద్ద అంబర్ పేట ప్రాంతంలో ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేస్తుండగా హఠాత్తుగా గుండె పోటుకు గురయ్యాడు. కారులోనే కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అతడిని అటుగా వెళ్తున్న రామన్నపేట సీఐ మోతీరాం గమనించాడు.

కొన ప్రాణాలతో ఉన్న భాదితునికి ఘటనా స్థలంలోనే సీపీఆర్ చేసి శ్వాస అందించాడు. స్పృహలోకి వచ్చిన అనంతరం హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు సీఐ మోతీరాం. కానీ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గ మధ్యలో బాధితుడు తుది శ్వాస విడిచాడు.

అంతిమంగా ఆ వ్యక్తి ప్రాణం పోయినా సీఐ చూపిన మానవత్వం బతికిందని, ఎమర్జెన్సీ సమయంలో సీఐ చూపిన మానవత్వం అందరి మన్ననలు అందుకుంది. అయితే ఈ ఘటన గుండె పోటు ఎంత ప్రమాద కరమో… సీపీఆర్ పై అవగాహన ఎంత అవసరమో రుజువు చేసింది.