HeartAttack | రైల్లో గుండెపోటు.. వ్యక్తి మృతి

HeartAttack | విధాత: వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో ఓ వ్యక్తి గుండెపోటు(Heart Attack)కు గురవగా, అత్యవసర పరిస్థితుల్లో రైలు ను మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో నిలిపారు. బాధితున్ని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు పరిశీలిస్తే. సికింద్రాబాద్ మీర్ పేటకు చెందిన 72 సంవత్సరాల ప్రభాకర్ అనే వ్యక్తి తన మనవరాలు పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చు కునేందుకు కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం వందేభారత్ […]

  • By: krs    latest    May 20, 2023 3:35 PM IST
HeartAttack | రైల్లో గుండెపోటు.. వ్యక్తి మృతి

HeartAttack |

విధాత: వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో ఓ వ్యక్తి గుండెపోటు(Heart Attack)కు గురవగా, అత్యవసర పరిస్థితుల్లో రైలు ను మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో నిలిపారు. బాధితున్ని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు పరిశీలిస్తే.

సికింద్రాబాద్ మీర్ పేటకు చెందిన 72 సంవత్సరాల ప్రభాకర్ అనే వ్యక్తి తన మనవరాలు పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చు కునేందుకు కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైల్లో తిరుపతికి బయలుదేరాడు.

నల్లగొండ దాటిన తర్వాత గుండె నొప్పివస్తుందని తెలుపగా మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో అత్యవసరంగా ట్రైన్ ను నిలిపివేశారు. అప్పటికే ట్రైన్ లో పలువురు ప్రయాణికులు ప్రభాకర్ కి సిపిఆర్ చేసి హుటాహుటిన అంబులెన్స్ లో మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రభాకర్ మృతి చెందారు.