Heavy Rains | తెలంగాణ వ్యాప్తంగా.. ఎడతెరిపి లేకుండా వర్షాలు
Heavy Rains | దాదాపు నెల రోజుల తర్వాత రాష్ట్రంలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్‌లో జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో పలు చోట్ల జనజీవనం స్తంభించింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, ప్రగతి […]

Heavy Rains |
దాదాపు నెల రోజుల తర్వాత రాష్ట్రంలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్‌లో జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో పలు చోట్ల జనజీవనం స్తంభించింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, ప్రగతి నగర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, ఉప్పల్, ఎల్‌బీనగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
దీంతో స్కూల్స్, ఆఫీసులకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపైకి వరద నీరు చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.అల్ప పీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదాబాద్ వాతావరణశాఖ తెలిపింది.
నేడు, రేపు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.