Telangana | తెలంగాణ‌లో రానున్న మూడు రోజుల్లో భారీ వ‌ర్షాలు..!

Telangana | తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో భారీ వ‌ర్షాలు( Rains ) కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ( Hyderabad Weather Dept ) తెలిపింది. భారీ ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని, ఉరుములు మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. తెలంగాణ వైపు తూర్పు, ఆగ్నేయ దిశ‌ల నుంచి గాలులు వీస్తున్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ స్ప‌ష్టం చేసింది. 15వ తేదీ(బుధ‌వారం) మ‌ధ్యాహ్నం నుంచి ఉత్త‌ర‌, ప‌శ్చిమ జిల్లాల్లో కొన్ని […]

Telangana | తెలంగాణ‌లో రానున్న మూడు రోజుల్లో భారీ వ‌ర్షాలు..!

Telangana | తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో భారీ వ‌ర్షాలు( Rains ) కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ( Hyderabad Weather Dept ) తెలిపింది. భారీ ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని, ఉరుములు మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. తెలంగాణ వైపు తూర్పు, ఆగ్నేయ దిశ‌ల నుంచి గాలులు వీస్తున్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ స్ప‌ష్టం చేసింది.

15వ తేదీ(బుధ‌వారం) మ‌ధ్యాహ్నం నుంచి ఉత్త‌ర‌, ప‌శ్చిమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపుల‌తో కూడిన మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. 16వ తేదీ(గురువారం) మ‌ధ్యాహ్నం నుంచి నిజామాబాద్, కామారెడ్డి, రాజ‌న్న సిరిసిల్ల‌, జగిత్యాల ప్రాంతాల్లో వ‌డ‌గ‌ళ్ల వాన కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. 17వ తేదీన‌(శుక్ర‌వారం) రాజ‌న్న సిరిసిల్ల‌, జ‌గిత్యాల‌, పెద్ద‌ప‌ల్లి, క‌రీంన‌గ‌ర్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. భారీ ఈదురు గాలులు కూడా వీచే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.