Megha Akash | రాజకీయ నాయకుడి కొడుకుతో టాలీవుడ్‌ బ్యూటీ పెళ్లి.! త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ చేయనున్న మేఘా ఆకాశ్‌..!

Megha Akash | టాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తున్నది. ఇటీవలే హీరో శర్వానంద్‌ పెళ్లి పీటలెక్కాడు. మెగా హీరో వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు టాక్‌. తాజాగా యంగ్‌ హీరోయిన్‌ మేఘా ఆకాశ్‌ సైతం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుతో మేఘా ఆకాశ్‌ పెళ్లి ఫిక్స్‌ అయ్యిందని సమాచారం. ఇది పెద్దలు కుదుర్చిన ప్రేమ వివాహమని తెలుస్తున్నది. […]

Megha Akash  | రాజకీయ నాయకుడి కొడుకుతో టాలీవుడ్‌ బ్యూటీ పెళ్లి.! త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ చేయనున్న మేఘా ఆకాశ్‌..!

Megha Akash |

టాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తున్నది. ఇటీవలే హీరో శర్వానంద్‌ పెళ్లి పీటలెక్కాడు. మెగా హీరో వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు టాక్‌. తాజాగా యంగ్‌ హీరోయిన్‌ మేఘా ఆకాశ్‌ సైతం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుతో మేఘా ఆకాశ్‌ పెళ్లి ఫిక్స్‌ అయ్యిందని సమాచారం. ఇది పెద్దలు కుదుర్చిన ప్రేమ వివాహమని తెలుస్తున్నది. త్వరలోనే మేఘా ఆకాశ్‌ పెళ్లిపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది.

మేఘా ఆకాశ్‌ 2017లో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నితిన్‌ హీరోగా తెరక్కెక్కిన ‘లై’ సినిమాలో నటించింది. ఆ తర్వాత ఛల్‌ మోహనరంగ, డియర్‌ మేఘా, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, కౌసల్యా క్రిష్ణమూర్తితో పాటు పలు చిత్రాల్లో నటించింది.

త‌మిళంలో ర‌జ‌నీకాంత్ పేట్ట, హిందీలో స‌ల్మాన్‌ఖాన్ రాధే సినిమాల్లో కీల‌క పాత్రల్లోనూ నటించి మెప్పించింది. అయితే, వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నా మేఘాకు రావాల్సినంత గుర్తింపు మాత్రం రాలేదు. మేఘా చివరిసారిగా తెలుగులో ర‌వితేజ ‘రావ‌ణాసుర’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ‘మను చరిత్ర’లో నటించగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. అలాగే పలు తమిళ చిత్రాల్లో నటిస్తున్నది.