High Court | రెడ్డి కాలేజీ సొసైటీకి భూ కేటాయింపుపై హైకోర్టులో విచార‌ణ‌..

High Court హైద‌రాబాద్‌, విధాత: రెడ్డి కాలేజీ సొసైటీకి బ‌ద్వేల్‌లో భూమి కేటాయింపుపై సామాజిక కార్య‌క‌ర్త‌లు రాజేశ్వ‌రరావు, విజ‌య్‌కుమార్ దాఖ‌లు చేసిన పిల్ దాఖ‌లు చేశారు. దీనిపై సీజే ఉజ్జ‌ల్ భూయాన్ ధ‌ర్మాస‌నం గురువారం విచార‌ణ చేప‌ట్టింది. ప్ర‌భుత్వం రూపాయికి ఎక‌రం చొప్పున 5 ఎక‌రాలు రెడ్డి కాలేజీ సొసైటీకి కేటాయించ‌డం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని పిటిష‌న‌ర్ త‌రుపు న్యాయ‌వాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 2018లో భూమి కేటాయిస్తే 5 ఏండ్ల త‌ర్వాత పిల్ ఎందుకు వేశార‌ని హైకోర్టు […]

  • Publish Date - June 15, 2023 / 02:15 PM IST

High Court

హైద‌రాబాద్‌, విధాత: రెడ్డి కాలేజీ సొసైటీకి బ‌ద్వేల్‌లో భూమి కేటాయింపుపై సామాజిక కార్య‌క‌ర్త‌లు రాజేశ్వ‌రరావు, విజ‌య్‌కుమార్ దాఖ‌లు చేసిన పిల్ దాఖ‌లు చేశారు. దీనిపై సీజే ఉజ్జ‌ల్ భూయాన్ ధ‌ర్మాస‌నం గురువారం విచార‌ణ చేప‌ట్టింది.

ప్ర‌భుత్వం రూపాయికి ఎక‌రం చొప్పున 5 ఎక‌రాలు రెడ్డి కాలేజీ సొసైటీకి కేటాయించ‌డం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని పిటిష‌న‌ర్ త‌రుపు న్యాయ‌వాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 2018లో భూమి కేటాయిస్తే 5 ఏండ్ల త‌ర్వాత పిల్ ఎందుకు వేశార‌ని హైకోర్టు ప్ర‌శ్నించ‌డంతో జీవోను ప్ర‌భుత్వం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయ‌లేద‌ని పిటిష‌న‌ర్ల త‌రుపు న్యాయ‌వాది చిక్కుడు ప్రుభాక‌ర్ వివ‌రించారు.

పిల్ వేయ‌డంలో జాప్యానికి కార‌ణాలు ప్ర‌స్తుతం భూ ఏ ద‌శ‌లో ఉందో అఫిడ‌విట్ ఫైల్ చేయాల‌ని పిటిష‌న‌ర్ల‌ను ఆదేశిస్తూ త‌దుప‌రి విచార‌ణ‌ను జూన్ 23కు వాయిదా వేసింది.