నూతన సంవత్సర వేడుకలకు హైకోర్టు బ్రేక్‌

రాత్రి పది తర్వాత ప‌బ్‌లు తెరిచి ఉంచరాదన్న హైకోర్టు అతిక్రమిస్తే చర్యలు తీవ్రమని హెచ్చరిక విధాత: కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో జంటనగరాల పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. ఇప్పటికే జంట నగరాల్లో ట్రాఫిక్ ఆంక్షలకు తోడు, ఇప్పుడు హైకోర్టు ఏకంగా పబ్బులకు కళ్లెం వేసింది. వేడుకల పేరుతో రాత్రంతా ప‌బ్‌లు తెరిచి ఉంచటం, రణగోణ ధ్వనులతో ప్రజలకు ఇబ్బంది కలిగించటం లాంటివి ఉండరాదని హైకోర్టు భావించింది. అందుకోసం బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ లో ఉన్న పది […]

నూతన సంవత్సర వేడుకలకు హైకోర్టు బ్రేక్‌
  • రాత్రి పది తర్వాత ప‌బ్‌లు తెరిచి ఉంచరాదన్న హైకోర్టు
  • అతిక్రమిస్తే చర్యలు తీవ్రమని హెచ్చరిక

విధాత: కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో జంటనగరాల పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. ఇప్పటికే జంట నగరాల్లో ట్రాఫిక్ ఆంక్షలకు తోడు, ఇప్పుడు హైకోర్టు ఏకంగా పబ్బులకు కళ్లెం వేసింది. వేడుకల పేరుతో రాత్రంతా ప‌బ్‌లు తెరిచి ఉంచటం, రణగోణ ధ్వనులతో ప్రజలకు ఇబ్బంది కలిగించటం లాంటివి ఉండరాదని హైకోర్టు భావించింది.

అందుకోసం బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ లో ఉన్న పది పబ్‌లు డిసెంబర్ 31న రాత్రి 10 గంటల తర్వాత తెరిచి ఉంచరాదని, మ్యూజిక్ సౌండ్ బయటకు వినిపించరాదని సూచించింది. రాత్రి 10 తర్వాత మూసి వేసే పబ్‌లు… జూబ్లీ 800, ఫర్జి కేఫ్, అమ్నిషియ, హై లైఫ్, దర్టీ మార్టిన్ కిచన్, బ్రాడ్వే, మాకొబ్రీవ్, హార్ట్ కప్, డైలీ డోస్ తదితర పబ్బులున్నాయి.

ఈ నేపథ్యంలో… పబ్బులన్నీ రాత్రి పది గంటలకే మూసి వేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. కొత్త సంవత్సర వేడుకలకు ప్రధాన కేంద్రాలైన ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లపై ఇప్పటికే నగర పోలీసులు కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ట్రాఫిక్ ఆంక్షలు డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు నిబంధనలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలంటే.. మందు, మజా. పోలీసుల తాజా ఆంక్షలను కొందరు అతిగా విమర్శిస్తున్నవారూ ఉండటం గమనార్హం.