లాయ‌ర్ ఆత్మ‌హ‌త్య‌.. హైకోర్టుపై దాడి

విధాత : మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టులో నిన్న ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. జ‌డ్జితో వివాదం జ‌రిగిన అనంత‌రం తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ఓ న్యాయ‌వాది ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. దీంతో మిగ‌తా న్యాయ‌వాదులంతా క‌లిసి.. లాయ‌ర్ డెడ్‌బాడీని కోర్టు ఆవ‌ర‌ణ‌లోకి తీసుకొచ్చి, నిర‌స‌న‌కు దిగారు. జ‌డ్జిపై ఆగ్ర‌హంతో ఉన్న లాయ‌ర్లు.. కోర్టు రూమ్స్‌లోకి ప్ర‌వేశించి, ధ్వంసం చేశారు. సీనియ‌ర్ అడ్వ‌కేట్ రూమ్‌కు నిప్పంటించారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. అయితే ఓ బెయిల్ పిటిష‌న్‌కు సంబంధించి జ‌డ్జికి […]

లాయ‌ర్ ఆత్మ‌హ‌త్య‌.. హైకోర్టుపై దాడి

విధాత : మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టులో నిన్న ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. జ‌డ్జితో వివాదం జ‌రిగిన అనంత‌రం తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ఓ న్యాయ‌వాది ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. దీంతో మిగ‌తా న్యాయ‌వాదులంతా క‌లిసి.. లాయ‌ర్ డెడ్‌బాడీని కోర్టు ఆవ‌ర‌ణ‌లోకి తీసుకొచ్చి, నిర‌స‌న‌కు దిగారు. జ‌డ్జిపై ఆగ్ర‌హంతో ఉన్న లాయ‌ర్లు.. కోర్టు రూమ్స్‌లోకి ప్ర‌వేశించి, ధ్వంసం చేశారు. సీనియ‌ర్ అడ్వ‌కేట్ రూమ్‌కు నిప్పంటించారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది.

అయితే ఓ బెయిల్ పిటిష‌న్‌కు సంబంధించి జ‌డ్జికి లాయ‌ర్ అనురాగ్ సాహుకు మ‌ధ్య నిన్న తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వివాదం అనంత‌రం అనురాగ్ సాహు ఆత్మ‌హత్య చేసుకున్న‌ట్లు తోటి న్యాయ‌వాదులు పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆందోళ‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్టేందుకు పోలీసులు లాఠీల‌కు ప‌ని చెప్పారు. అనురాగ్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైన జ‌డ్జిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని న్యాయ‌వాదులు డిమాండ్ చేశారు.