నీటి పారుద‌ల ప్రాజెక్ట్‌ల అభివృద్దిపై కొన‌సాగుతున్న స‌మీక్ష‌

నీటి పారుదల ప్రాజెక్టులపై అభివృద్ధిపై మార్చి5 మంగ‌ళ‌వారం రోజున‌ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌ల‌సౌద‌లో ఉన్న‌త స్థాయి స‌మీక్ష జ‌రుగుతోంది

నీటి పారుద‌ల ప్రాజెక్ట్‌ల అభివృద్దిపై కొన‌సాగుతున్న స‌మీక్ష‌

విధాత‌: నీటి పారుదల ప్రాజెక్టులపై అభివృద్ధిపై మార్చి5 మంగ‌ళ‌వారం రోజున‌ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌ల‌సౌద‌లో ఉన్న‌త స్థాయి స‌మీక్ష జ‌రుగుతోంది. ఈ స‌మావేశంలో నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్తో పాటుఉన్నతాధికారులు, సీనియ‌ర్ ఇంజనీర్లు పాల్గొన్నారు.


ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌పై చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు తెలిసింది. మార్చి 6 బుధ‌వారం నాడు ఎన్‌డీఎస్ ఏ నియ‌మించిన నిపుణుల బృందం కాళేశ్వ‌రం ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ స‌మావేశానికి అత్యంత ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. ఇచ్చిన ఆదేశాల మేర‌కు అధికారులు పూర్తి వివ‌రాల‌తో స‌మావేశానికి హాజ‌ర‌య్యారు.


ఈ స‌మీక్ష‌లో ప్యాకేజీల వారీగా ప్రాజెక్టు పనుల పురోగతి, నిధుల వివరాలు, అందుబాటు లోకి వచ్చిన ఆయకట్టు, తదితర అంశాలపై స‌మ‌గ్రంగా చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం. కుంగిన మేడిగ‌డ్డ బారాజ్ మ‌ర‌మ్మ‌త్తులు చేయాల్సి ఉంది. కానీ నిపుణుల నివేదిక వ‌చ్చిన త‌రువాత‌నే చ‌ర్య‌లు తీసుకోనున్నారు. ఈ నేప‌థ్యంలో తాగు నీరు, సాగు నీరు ఇవ్వ‌డానికి ప్ర‌త్యామ్నాయాల‌పై కూడా చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం.