Telangana | ఇవాళ‌, రేపు దంచికొట్ట‌నున్న ఎండ‌లు.. వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌

Telangana | గ‌త రెండు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఎండ‌లు దంచికొడుతున్న విష‌యం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్ర‌జ‌లు ఉక్క‌పోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మ‌రో రెండు రోజుల పాటు కూడా ఈ ఎండ‌లు కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ఇవాళ‌, రేపు గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. ద్రోణి బ‌ల‌హీన‌ప‌డి నైరుతి దిశ నుంచి తెలంగాణ వైపున‌కు గాలులు వీస్తున్నాయ‌ని, ఈ నేప‌థ్యంలో […]

Telangana | ఇవాళ‌, రేపు దంచికొట్ట‌నున్న ఎండ‌లు.. వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌

Telangana | గ‌త రెండు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఎండ‌లు దంచికొడుతున్న విష‌యం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్ర‌జ‌లు ఉక్క‌పోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మ‌రో రెండు రోజుల పాటు కూడా ఈ ఎండ‌లు కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది.

ఇవాళ‌, రేపు గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. ద్రోణి బ‌ల‌హీన‌ప‌డి నైరుతి దిశ నుంచి తెలంగాణ వైపున‌కు గాలులు వీస్తున్నాయ‌ని, ఈ నేప‌థ్యంలో ప‌లు ప్రాంతాల్లో గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

రాబోయే రెండు రోజుల్లో గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు 40 నుంచి 43 డిగ్రీల వ‌ర‌కు న‌మోదు అవుతాయ‌ని తెలిపింది. గురువారం భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు ప్ర‌జ‌లు విల‌విల‌లాడిపోయారు. ఉద‌యం 7 గంట‌ల నుంచే వేడి గాలులు మొద‌ల‌య్యాయి. మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ఎండ‌లు దంచికొట్ట‌డంతో ప్ర‌జ‌లు చాలా ఇబ్బంది ప‌డ్డారు. అయితే శుక్ర‌, శ‌నివారాల్లో ఎండ‌ల తీవ్ర పెర‌గ‌నున్నందున ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని వైద్యులు సూచించారు.