YADAGIRIGUTTA: యాదగిరిగుట్టలో ఘనంగా హోలీ సేవోత్సవం

Holi sevotsavam at Yadagirigutta విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో హోలీ పండుగ సందర్భంగా స్వామి అమ్మవార్లకు మంగళవారం హోలీ సేవోత్సవం ఘ‌నంగా నిర్వహించారు. రంగుల వసంతోత్సవం అనంతరం పంచదార చిలకల పేరు దండలతో అలంకరించి తిరు వీధుల్లో పల్లకి సేవ నిర్వహించారు. స్వామివారి హోలీ సేవోత్సవంలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని పులకించారు. స్వామివారిని పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ […]

YADAGIRIGUTTA: యాదగిరిగుట్టలో ఘనంగా హోలీ సేవోత్సవం

Holi sevotsavam at Yadagirigutta

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో హోలీ పండుగ సందర్భంగా స్వామి అమ్మవార్లకు మంగళవారం హోలీ సేవోత్సవం ఘ‌నంగా నిర్వహించారు. రంగుల వసంతోత్సవం అనంతరం పంచదార చిలకల పేరు దండలతో అలంకరించి తిరు వీధుల్లో పల్లకి సేవ నిర్వహించారు.
స్వామివారి హోలీ సేవోత్సవంలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని పులకించారు.

స్వామివారిని పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కే. శ్రీనివాసరాజు, వ్యవసాయ శాఖ సెక్రెటరీ రఘునందన్ రావు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.