Karnataka | కర్ణాటక ఎన్నికల బరిలో కోటీశ్వరుడి భార్య.. స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ
Karnataka | ఓ కోటీశ్వరుడి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగింది. అదేదో రాజకీయ పార్టీల తరఫున ఆమె పోటీ చేయడం లేదు. స్వతంత్ర అభ్యర్థిగానే ఆమె పోటీ చేస్తోంది. ఆ కోటీశ్వరుడి భార్య ఎన్నికల బరిలో నిలవడంతో కర్ణాటక రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ఆ కోటీశ్వరుడు ఎవరో కాదు.. రెండేండ్ల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన కేజీఎఫ్ బాబు. బెంగళూరులో గజరీ వ్యాపారాన్ని ప్రారంభించి కోట్లకు పడగలెత్తిన […]

Karnataka | ఓ కోటీశ్వరుడి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగింది. అదేదో రాజకీయ పార్టీల తరఫున ఆమె పోటీ చేయడం లేదు. స్వతంత్ర అభ్యర్థిగానే ఆమె పోటీ చేస్తోంది. ఆ కోటీశ్వరుడి భార్య ఎన్నికల బరిలో నిలవడంతో కర్ణాటక రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ఆ కోటీశ్వరుడు ఎవరో కాదు.. రెండేండ్ల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన కేజీఎఫ్ బాబు.
బెంగళూరులో గజరీ వ్యాపారాన్ని ప్రారంభించి కోట్లకు పడగలెత్తిన కేజీఎఫ్ వాసి యూసుఫ్ షరీఫ్ అలియాస్ కేజీఎఫ్ బాబు. రెండేండ్ల కింద బెంగళూరు నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసిన కేజీఎఫ్ బాబు.. ఆ సమయంలో తన ఆస్తులు రూ. 1,743 కోట్లు అని ప్రకటించుకున్నారు. అయితే ఈసారి చిక్కపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ కార్యకర్తలతో విభేదాలు రావడంతో బాబును పక్కనపెట్టింది పార్టీ. దీంతో ఆయన భార్య షాజియా తరునంను బెంగళూరు సెంట్రల్ చిక్కపేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టారు. భర్త, కుమార్తెతో కలిసి గురువారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇటీవలే కేజీఎఫ్ బాబును కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది.