Honda Cars Prices Hike | వాహనదారులకు షాక్.. కార్ల ధరలను పెంచిన హోండా.. ఏ మోడల్‌పై ఎంత అంటే..?
Honda Cars Prices Hike | భారత్‌లో పండుగ సీజన్ దాదాపు మొదలైంది. పండుగ సీజన్ సందర్భంగా చాలా మంది కొత్త వాహనాలను తీసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే, హోండా కార్లను కొనుగోలు చేయాలనుకే వారికి కంపెనీ షాక్ ఇచ్చింది. రెండు మోడల్స్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. సిటీ, అమేజ్ మోడల్స్ ధరలను పెంచగా.. ఈ రెండు మోడల్స్‌కు చెందిన అన్ని వేరియంట్లపై పెంపు వర్తిస్తుందని పేర్కొంది. అత్యధికంగా రూ.7,900 వరకు పెంపు ఉండనుండగా.. ఉత్పత్తి […]

Honda Cars Prices Hike |
భారత్‌లో పండుగ సీజన్ దాదాపు మొదలైంది. పండుగ సీజన్ సందర్భంగా చాలా మంది కొత్త వాహనాలను తీసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే, హోండా కార్లను కొనుగోలు చేయాలనుకే వారికి కంపెనీ షాక్ ఇచ్చింది. రెండు మోడల్స్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. సిటీ, అమేజ్ మోడల్స్ ధరలను పెంచగా.. ఈ రెండు మోడల్స్‌కు చెందిన అన్ని వేరియంట్లపై పెంపు వర్తిస్తుందని పేర్కొంది.
అత్యధికంగా రూ.7,900 వరకు పెంపు ఉండనుండగా.. ఉత్పత్తి వ్యయం అనూహ్యంగా పెరగడంతో ధరలు పెంచక తప్పడం లేదని కంపెనీ తెలిపింది. అయితే, సెప్టెంబర్‌లో కార్ల ధరలు పెరుగుతాయని హోండా ఇటీవలే ప్రకటించింది.
హోండా అమేజ్‌లో మెటాలిక్ ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్స్ ఉన్న వేరియంట్లపై రూ.6,900.. సాలిడ్ ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్ ఉన్న వేరియంట్లపై రూ.4,900 మేరకు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. తాజాగా ధరల పెంపు తర్వాత హోండా అమేజ్ ఎక్స్‌షోరూం ధర రూ.7.10లక్షల నుంచి రూ.9.71లక్షల మధ్య ఉండనున్నది.
హోండా సిటీ ధర ఎంత పెరిగిందంటే..
హోండా సిటీ మోడల్ సిటీ ధరను సైతం పెంచగా.. మెటాలిక్ ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్స్ ఉన్న వేరియంట్లపై రూ.7,900.. ఇతర వేరియంట్లపై రూ.5,900 మేరకు ధరను కంపెనీ పెంచింది. తాజా పెంపు తర్వాత హోండా సిటీ కారు ఎక్స్ షోరూం ధర రూ.11.63 లక్షల నుంచి రూ.16.02 లక్షల మధ్య ఉండనున్నది.
అయితే, హోండా హైబ్రిడ్ వేరియంట్ల ధరలను మాత్రం పెంచలేదు. హోండా సిటీ నాలుగు వేరియంట్లలో లభిస్తుండగా.. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వస్తుండగా.. హోండా అమేజ్ 1.2 లీటర్ ఐ వీటెక్ నాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్నది.