23.02.2023 గురువారం రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనప్రాప్తి..!
మేషరాశి : కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వృత్తి, ఉద్యోగులలో చికాకులు ఏర్పడతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధనవ్యయము కలుగుతుంది. జ్వరాది బాధలు కలుగవచ్చును. వృషభారాశి : ప్రముఖులతో కలయిక లాభిస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. బంగారు వస్తువులు కొనే అవకాశమున్నది. పండితులు నూతన ప్రయత్నములు ఆరంభిస్తారు. మిథున రాశి: వ్యాపారస్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. సన్నిహితుల మూలకంగా అశాంతి కలుగవచ్చును. దుష్ప్రవర్తనకు తావివ్వకండి. బంధు మిత్రుల సలహాలను పాటించండి. కర్కాటక రాశి : స్థానచలనము […]

మేషరాశి : కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వృత్తి, ఉద్యోగులలో చికాకులు ఏర్పడతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధనవ్యయము కలుగుతుంది. జ్వరాది బాధలు కలుగవచ్చును.
వృషభారాశి : ప్రముఖులతో కలయిక లాభిస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. బంగారు వస్తువులు కొనే అవకాశమున్నది. పండితులు నూతన ప్రయత్నములు ఆరంభిస్తారు.
మిథున రాశి: వ్యాపారస్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. సన్నిహితుల మూలకంగా అశాంతి కలుగవచ్చును. దుష్ప్రవర్తనకు తావివ్వకండి. బంధు మిత్రుల సలహాలను పాటించండి.
కర్కాటక రాశి : స్థానచలనము కలుగవచ్చును. చేస్తున్న పనిని మధ్యలో వదిలేస్తారు. అధికారుల మూలకంగా అశాంతి ఏర్పడుతుంది. పెద్దల ఆశీర్వచనములను పొందండి. ధన లాభము కలుగుతుంది.
సింహరాశి : ఉదర సంబంధమైన బాధలు కలుగవచ్చును. ప్రజాభిమానమును కాపాడుకోండి. కుటుంబ సభ్యులతో అపార్ధములు రాకుండా జాగ్రత్త పడండి. అపవాదులు బాధిస్తాయి.
కన్యారాశి: శత్రుత్వ బాధలు తొలగిపోయే అవకాశముంది. భాగస్వాములతో వ్యవహార సిద్ధి కలుగుతుంది. నష్టపోయామనుకున్న ధనము చేతికందుతుంది. పట్టదలతో కార్యసిద్ధి కలుగుతుంది.
తులారాశి : మూలకమైన అశాంతి కలుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి, కుటుంబసభ్యులపై అపవాదులు బాధ కలిగిస్తాయి. ధనాగమము నిరాశ కలుగిస్తుంది. మంచి సంఖాషణలను వింటారు.
వృశ్చికరాశి: అధికారుల మూలక భయముంటుంది. ఇష్టమైన వస్తువులు చేతికందవు. అధిక సంచారము మూలకంగా అలసట వుంటుంది. భోజన సౌఖ్యము తక్కువ. ధనప్రాప్తి కొద్దిగానే వుంటుంది.
ధనుస్సు రాశి : క్రయ విక్రయములు సంతోషాన్నిస్తాయి. సరియైన ఆలోచనలతో కార్యసిద్ధి కలుగుతుంది, దైవసంబంధ వ్యవహారాలలో పాల్గొంటారు. సోదరులు మూలకంగా ధనలాభం కలుగుతుంది.
మకరరాశి : వాక్చాతుర్యంతో పనులు చక్కబడతాయి. ఇబ్బమైన వ్యక్తులతో కలయికలు సంతోషాన్నిస్తాయి. ఆత్మస్థైర్యంతో విజయాలను అందుకుంటారు. స్వల్ప ధన ప్రాప్తి కలుగుతుంది.
కుంభరాణి : జ్వరము మొదలైన స్వల్ప శరీర బాధలుంటాయి. నిందలను వినవలసి వస్తుంది, ధనక్షయము అశాంతి కలిగిస్తుంది. తల్లిదండ్రుల అనారోగ్యముతో ఆందోళన చెందుతారు. మీ కష్టానికి గుర్తింపు లభించదు.
మీనం : వివాదాలలో విజయం సాధిస్తారు. ప్రముఖులను కలుసుకొంటారు. వ్యయం పెరిగినను అనుకున్న పనులను పూర్తిచేస్తారు. శుభాకార్య నిర్వహణకై ప్రణాళికలు వేస్తారు. వ్యాపారాలు కూరాభిస్తాయి.
– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్ నంబర్ : +91 99490 11332