16.02.2023 గురువారం, రాశి ఫ‌లాలు.. ఆ రాశివారికి ధననష్టం కలిగే అవకాశం..!

మేషం : భావోద్వేగము పొందెదరు. పట్టుదలతో వ్యవహరింతురు, శ్రమ ఎక్కువైననూ కార్య సిద్ది కలుగును. క్రీడాకారులకు శ్రమతో కూడిన విజయములు లభించగలవు. ప్రయాణములు చేయుదురు. వృషభం : ఆకస్మిక ప్రమాదములు కలుగవచ్చును. ధనవ్యయము ఎక్కువగా వుంటుంది. కోపం పెరుగుతుంది. అందువలన కలహములు కూడా కలుగవచ్చును. ప్రయత్న కార్యములు ఆశించిన ఫలితాన్నివ్వవు. మిథునం : ఉన్నచోటు నుండే పనులను చక్కబెడుతారు. ఆకస్మిక ధనలాభం కనిపిస్తుంది. మోసగాళ్ళ బారి నుండి తప్పించుకుంటారు. జీవితా భాగస్వామితో అపార్థాలు తొలగిపోతాయి. ఉల్లాసంగా గడుపుతారు. […]

16.02.2023 గురువారం, రాశి ఫ‌లాలు.. ఆ రాశివారికి ధననష్టం కలిగే అవకాశం..!

మేషం : భావోద్వేగము పొందెదరు. పట్టుదలతో వ్యవహరింతురు, శ్రమ ఎక్కువైననూ కార్య సిద్ది కలుగును. క్రీడాకారులకు శ్రమతో కూడిన విజయములు లభించగలవు. ప్రయాణములు చేయుదురు.

వృషభం : ఆకస్మిక ప్రమాదములు కలుగవచ్చును. ధనవ్యయము ఎక్కువగా వుంటుంది. కోపం పెరుగుతుంది. అందువలన కలహములు కూడా కలుగవచ్చును. ప్రయత్న కార్యములు ఆశించిన ఫలితాన్నివ్వవు.

మిథునం : ఉన్నచోటు నుండే పనులను చక్కబెడుతారు. ఆకస్మిక ధనలాభం కనిపిస్తుంది. మోసగాళ్ళ బారి నుండి తప్పించుకుంటారు. జీవితా భాగస్వామితో అపార్థాలు తొలగిపోతాయి. ఉల్లాసంగా గడుపుతారు.

కర్కాటకం : స్థిరాస్థి కొనుగోలు ప్రయత్నాలకు అనుకూలము. వృత్తిలో మీరు కోరుకున్న స్థానాన్ని పొందుతారు. ధనలాభముంటుంది, వ్యాపారస్థుల నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి..

సింహం : వృథా సంచారము కలుగవచ్చును. ఇష్టమైన వస్తువులను సంగ్రహించడం ఆలస్యమవుతుంది. గృహమందు అశాంతి కలుగవచ్చును. ఔషధ సేవనము చేయవలసి రావచ్బును. మనోధైర్యము విఖ్యాత కోల్పోకండి.

కన్య : వివాహ ప్రయత్నములు ఫలిస్తాయి. ప్రయాణముల మూలకంగా లాభం ఉంటుంది, కార్య సాధనకై కొంత రాజీపడవలసి వస్తుంది. సత్ప్రవర్తన సంతోషాన్నిస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

తుల : తల్లి తరపు బంధువుల మూలకంగా సంతోషము కలుగుతుంది ఆత్మ స్థైర్యం కార్యనిర్వహ‌న చేస్తారు. ధనప్రాప్తి కొంతవరకు వుంటుంది, సంభాషణలు ఉల్లాసాన్నిస్తాయి..

వృశ్చికం : వాహనమూలక అశాంతి వేలుగవచ్చును. స్థిరాస్థి ప్రయత్నమాలు అనుకూలించవు, భోజన సౌఖ్యము తక్కువగా వుంటుంది. వైద్యులను కలవాల్సి రావచ్చును కారబాధ లుండవచ్చును.

ధ‌నుస్సు : పుణ్య క్షేత్ర సందర్శనము చేస్తారు. పొగొట్టుకున్న ధనము చేతికందుతుంది. సోదర వర్గముతో ఉల్లాసంగా గడుపుతారు. అద్భుతమైన ప్రసంగాలను విన‌డంవలన ఆనందం కలుగుతుంది.

మకరం : అవమానములు బాధిస్తాయి, నేత్ర బాధ, నిరోవేదన తెలుగు వచ్చును. కుటుంబంలో అభిప్రాయ భేదాలు రావచ్చును. ఊహించ‌ని సంఘటనలు ఆర్చర్యాని ధనవ్యయము ఎక్కువగా వుండవచ్చును.

కుంభం : స్థిరాస్థి మూలక లాభ‌ములుంటాయి. సామాజిక భాధ్యతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మూలకం సంతోషం కలుగుతుంది. ధన, ధాన్య లాభ‌ములుంటాయి. కార్య సాధనలో విజ్ఞత‌ను ప్రదర్శిస్తారు.

మీనం : వివాదాలలో విజయం సాధిస్తారు. ప్రముఖులను కలుసుకొంటారు. వ్యయం పెరిగినను అనుకున్న పనులను పూర్తిచేస్తారు. శుభాకార్య నిర్వహణకై ప్రణాళికలు వేస్తారు. వ్యాపారాలు కూరాభిస్తాయి.